Telugu Global
Cinema & Entertainment

అరవింద సమేత ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్

3 రోజులకే వంద కోట్ల రూపాయలు వచ్చినట్టు ప్రకటించుకుంది అరవింద సమేత యూనిట్. ఫస్ట్ వీకెండ్ 100 కోట్లు అంటూ పోస్టర్ పెట్టి మరీ సక్సెస్ సంబరాలు చేసుకున్నారు. మొత్తానికి ఎలాగోలా ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ చేసుకుంది ఎన్టీఆర్ సినిమా. విడుదలైన ఈ 4 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 49 కోట్ల రూపాయల షేర్ రాగా.. ఓవర్సీస్ లో 1.67 మిలియన్ డాలర్ల వసూళ్లు వచ్చాయి. ట్రేడ్ లెక్కల ప్రకారం, ఫస్ట్ వీకెండ్ నాటికి […]

అరవింద సమేత ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్
X

3 రోజులకే వంద కోట్ల రూపాయలు వచ్చినట్టు ప్రకటించుకుంది అరవింద సమేత యూనిట్. ఫస్ట్ వీకెండ్ 100 కోట్లు అంటూ పోస్టర్ పెట్టి మరీ సక్సెస్ సంబరాలు చేసుకున్నారు. మొత్తానికి ఎలాగోలా ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ చేసుకుంది ఎన్టీఆర్ సినిమా. విడుదలైన ఈ 4 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 49 కోట్ల రూపాయల షేర్ రాగా.. ఓవర్సీస్ లో 1.67 మిలియన్ డాలర్ల వసూళ్లు వచ్చాయి.

ట్రేడ్ లెక్కల ప్రకారం, ఫస్ట్ వీకెండ్ నాటికి ఓవరాల్ గా 44శాతం రికవరీ అయింది. ఓవర్సీస్ లో మాత్రం 66శాతం రికవరీ అయినట్టు అక్కడి డిస్ట్రిబ్యూటర్లు ప్రకటించుకున్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్ లో మరో 4 రోజుల్లో చాలా ఏరియాల్లో అరవింద సమేత బ్రేక్ ఈవెన్ లోకి వచ్చే ఛాన్స్ ఉంది. నైజాంలో మాత్రం బ్రేక్ ఈవెన్ లోకి రావాలంటే ఈ సినిమాకు 20 కోట్ల రూపాయలు రావాలి. అంటే అదనంగా మరో 6 కోట్ల రూపాయలు రావాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ వీకెండ్ (తొలి 4 రోజులు) అరవింద సమేతకు వచ్చిన వసూళ్లు ఇలా ఉన్నాయి.

ఏపీ, నైజాం 4 రోజుల షేర్
నైజాం – రూ. 13.80 కోట్లు
సీడెడ్ – రూ. 10.95 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 5.57 కోట్లు
ఈస్ట్ – రూ. 4.04 కోట్లు
వెస్ట్ – రూ. 3.32 కోట్లు
గుంటూరు – రూ. 6.10 కోట్లు
కృష్ణా – రూ. 3.52 కోట్లు
నెల్లూరు – రూ. 1.80 కోట్లు

First Published:  15 Oct 2018 11:24 AM GMT
Next Story