Telugu Global
Cinema & Entertainment

హలో గురూ.. సెన్సార్ పూర్తయింది

రామ్ హీరోగా నటిస్తున్న సినిమా హలో గురు ప్రేమకోసమే సినిమా. దిల్ రాజు నిర్మాతగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి. సినిమాకు క్లీన్-యు సర్టిఫికేట్ దక్కింది. సెన్సార్ పూర్తవ్వడంతో సినిమా అఫీషియల్ రిలీజ్ కు లైన్ క్లియర్ అయింది. దసరా కానుకగా ఈనెల 18న వరల్డ్ వైడ్ థియేటర్లలోకి రానుంది హలో గురు ప్రేమకోసమే సినిమా. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కింది హలో గురు ప్రేమకోసమే సినిమా. […]

హలో గురూ.. సెన్సార్ పూర్తయింది
X

రామ్ హీరోగా నటిస్తున్న సినిమా హలో గురు ప్రేమకోసమే సినిమా. దిల్ రాజు నిర్మాతగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి. సినిమాకు క్లీన్-యు సర్టిఫికేట్ దక్కింది. సెన్సార్ పూర్తవ్వడంతో సినిమా అఫీషియల్ రిలీజ్ కు లైన్ క్లియర్ అయింది. దసరా కానుకగా ఈనెల 18న వరల్డ్ వైడ్ థియేటర్లలోకి రానుంది హలో గురు ప్రేమకోసమే సినిమా.

త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కింది హలో గురు ప్రేమకోసమే సినిమా. బెజవాడ ప్రసన్నకుమార్ ఈ సినిమాకు కథ అందించడంతో పాటు మాటలు రాసిచ్చాడు. రామ్ సరసన అనుపర పరమేశ్వరన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. వీళ్లిద్దరూ కలిసి చేసిన రెండో సినిమా ఇది. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరక్టర్.

రామ్ గత చిత్రం ఉన్నది ఒకటే జిందగీ ఫ్లాప్ అయింది. దీంతో తన ఆశలన్నీ ఈ సినిమాపైనే పెట్టుకున్నాడు. ఇది కూడా ఫ్లాప్ అయితే ఈ హీరో కెరీర్ లో మళ్లీ గ్యాప్ రావడం ఖాయం. దిల్ రాజుకు కూడా ఈ సినిమా విజయం చాలా కీలకం. అతడికి కూడా ఈమధ్య వరుసగా ఎదురుదెబ్బలు తగిలాయి.

First Published:  15 Oct 2018 7:47 AM GMT
Next Story