Telugu Global
Others

మధుమేహాన్ని జయిద్దామా?

హైదరాబాద్ వంటి మహానగరాలు ఇపుడు మధుమేహం (షుగర్) వ్యాధిగ్రస్తుల హబ్‌లుగా మారిపోతున్నాయి. మధుమేహవ్యాధిని అదుపులో ఉంచుకోవడం అంత కష్టమేమీ కాదు. కాకుంటే క్రమం తప్పకుండా కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుందని నిపుణులంటున్నారు. శరీరంలోని చక్కెర స్థాయిలను ఆరోగ్యకర స్థాయిలో ఉండేలా చూసుకోవాలి. రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గడాన్ని ‘హైపో గ్లైసేమియా’ అంటారు. చక్కెర స్థాయిలు అధికం కావడాన్ని ‘హైపర్ గ్లైసేమియా’ అంటారు. ఇవి రెండూ ప్రమాదమే. అందుకే క్రమం తప్పకుండా షుగర్ టెస్ట్ చేయించుకుంటూ ఉండాలి.  మధుమేహగ్రస్తులు ఫైబర్ ఎక్కువగా […]

food for diabetics
X
హైదరాబాద్ వంటి మహానగరాలు ఇపుడు మధుమేహం (షుగర్) వ్యాధిగ్రస్తుల హబ్‌లుగా మారిపోతున్నాయి. మధుమేహవ్యాధిని అదుపులో ఉంచుకోవడం అంత కష్టమేమీ కాదు. కాకుంటే క్రమం తప్పకుండా కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుందని నిపుణులంటున్నారు. శరీరంలోని చక్కెర స్థాయిలను ఆరోగ్యకర స్థాయిలో ఉండేలా చూసుకోవాలి. రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గడాన్ని ‘హైపో గ్లైసేమియా’ అంటారు. చక్కెర స్థాయిలు అధికం కావడాన్ని ‘హైపర్ గ్లైసేమియా’ అంటారు. ఇవి రెండూ ప్రమాదమే. అందుకే క్రమం తప్పకుండా షుగర్ టెస్ట్ చేయించుకుంటూ ఉండాలి. మధుమేహగ్రస్తులు ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. దీనివల్ల ఇన్సులిన్ విడుదల సాధారణ స్థాయిలో ఉంటుంది. ఆహారంలో కార్బొహైడ్రేట్‌లు, కొవ్వు పదార్థాలు తక్కువ ఉండేలా చూసుకోవాలి. పొగత్రాగేవారు మానేయడం మంచిది. పొగత్రాగడం వల్ల గుండె సంబంధ వ్యాధులు మాత్రమే కాక మధుమేహవ్యాధిని ప్రభావితం చేసే హార్మోన్‌ల విడుదలలో కూడా మార్పులు వస్తాయి. నీరు ఎక్కువగా తాగుతుండాలి. దీని వల్ల రక్తంలోని చక్కెర, కొవ్వు పదార్థాల స్థాయిలు అదుపులో ఉంటాయి. తగినంత నిద్ర చాలా అవసరం. లేదంటే శరీరంలో హార్మోన్‌ల విడుదలలో అసమతౌల్యానికి దారి తీస్తుంది. ప్రతిరోజూ తగినంత వ్యాయామం తప్పనిసరి. దీనివల్ల మధుమేహమే కాదు ఇతర చాలా రకాల వ్యాధులను అదుపులో ఉంచుకోవచ్చు. వ్యాయామం వల్ల శరీరం ఉత్తేజితమై వ్యాధి నిరోధక శక్తి ఇనుమడిస్తుంది. ఆల్కహాల్ మానడం మంచిది. ఆల్కహాల్‌లో అధికంగా ఉండే క్యాలరీలు మధుమేహాన్ని మరింత ప్రేరేపిస్తాయి.
First Published:  14 Oct 2018 9:10 PM GMT
Next Story