Telugu Global
Cinema & Entertainment

నాని సినిమాలో సత్యరాజ్

త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్న జెర్సీ సినిమాకు సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ ఊపందుకుంది. ఈ మూవీలో ఇప్పటికే హీరోయిన్ గా శ్రద్ధా శ్రీనాధ్ ను తీసుకున్నారు. మరోవైపు నాని కూడా క్రికెట్ ప్రాక్టీస్ట్ మొదలుపెట్టాడు. తాజాగా ఈ లిస్ట్ లోకి సత్యరాజ్ కూడా చేరాడు. విలక్షణ పాత్రలకు పెట్టింది పేరైన సత్యరాజ్.. జెర్సీ సినిమాలో క్రికెట్ కోచ్ గా కనిపించబోతున్నాడు. నానిని పూర్తిస్థాయి క్రికెటర్ గా మార్చడంతో పాటు, అతడి ప్రేమకథను ఓ దారికి తీసుకొచ్చిన వ్యక్తిగా జెర్సీలో […]

నాని సినిమాలో సత్యరాజ్
X

త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్న జెర్సీ సినిమాకు సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ ఊపందుకుంది. ఈ మూవీలో ఇప్పటికే హీరోయిన్ గా శ్రద్ధా శ్రీనాధ్ ను తీసుకున్నారు. మరోవైపు నాని కూడా క్రికెట్ ప్రాక్టీస్ట్ మొదలుపెట్టాడు. తాజాగా ఈ లిస్ట్ లోకి సత్యరాజ్ కూడా చేరాడు.

విలక్షణ పాత్రలకు పెట్టింది పేరైన సత్యరాజ్.. జెర్సీ సినిమాలో క్రికెట్ కోచ్ గా కనిపించబోతున్నాడు. నానిని పూర్తిస్థాయి క్రికెటర్ గా మార్చడంతో పాటు, అతడి ప్రేమకథను ఓ దారికి తీసుకొచ్చిన వ్యక్తిగా జెర్సీలో సత్యరాజ్ కనిపించబోతున్నాడు.

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రాబోతోంది జెర్సీ. దసరా నుంచి ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. అదే ఊపులో హైదరాబాద్ లో ఫస్ట్ షెడ్యూల్ కొనసాగిస్తారు. గతంలో అజ్ఞాతవాసి సినిమాకు సంగీతం అందించిన మ్యూజిక్ డైరక్టర్ అనిరుధ్ కు తెలుగులో ఇది రెండో సినిమా.

First Published:  15 Oct 2018 7:49 AM GMT
Next Story