Telugu Global
NEWS

ఎన్నికల కోడ్ ఎఫెక్ట్.... రూ. 50వేలకు మించితే....

పెళ్లైనా, పేరంటమైనా…. వాహన కొనుగోలు అయినా…. లేదా బ్యాంకుల్లో జమ చేయడానికైనా…. మీరు 50వేలకు మించి పట్టుకొని తెలంగాణలో తిరగొద్దు. తిరిగితే మీ డబ్బు ఖతమే…. అవును ఇది నిజమే. పట్టణాలు, మండలాల సరిహద్దుల్లో పోలీస్ లు  చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఇక నుంచి ఆధారాలు లేకుండా 50వేలకు మించి డబ్బు మీ దగ్గరుంటే సీజ్ చేసేస్తారు. తర్వాత నెత్తి నోరు బాదుకున్నా కానీ మీకు తిరిగి ఇవ్వరు. దానికి పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అందుకే […]

ఎన్నికల కోడ్ ఎఫెక్ట్.... రూ. 50వేలకు మించితే....
X

పెళ్లైనా, పేరంటమైనా…. వాహన కొనుగోలు అయినా…. లేదా బ్యాంకుల్లో జమ చేయడానికైనా…. మీరు 50వేలకు మించి పట్టుకొని తెలంగాణలో తిరగొద్దు. తిరిగితే మీ డబ్బు ఖతమే…. అవును ఇది నిజమే.

పట్టణాలు, మండలాల సరిహద్దుల్లో పోలీస్ లు చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఇక నుంచి ఆధారాలు లేకుండా 50వేలకు మించి డబ్బు మీ దగ్గరుంటే సీజ్ చేసేస్తారు. తర్వాత నెత్తి నోరు బాదుకున్నా కానీ మీకు తిరిగి ఇవ్వరు. దానికి పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అందుకే డబ్బులను పట్టుకొని తిరగవద్దని పోలీసు అధికారులు సూచిస్తున్నారు. ఇంతకీ ఎందుకిలా అంటే అంతా ఎన్నికలు తెచ్చిన తంట అని చెప్పక తప్పదు.

తాజాగా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భారీగా డబ్బు, మద్యం రవాణా అవుతోందన్న ఉన్నతాధికారుల హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలు, మండలాల సరిహద్దుల్లో రహదారులపై చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. పెద్ద మొత్తంలో అంటే 50వేలకు మించి గుర్తింపు పత్రాలు, ఆధారాలు చూపించకుండా పట్టుకెళ్లే సొమ్మును, మద్యాన్ని సీజ్ చేసేస్తున్నారు. జిల్లాలోకి వచ్చే ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి స్వాధీనం చేసుకుంటున్నారు.

తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులో భాగంగా నగదు రవాణాపై అధికారులు పరిమితి విధించారు. 24 గంటలు నిఘా ఏర్పాటు చేశారు. రూ.50వేలకు మించితే సరైన ఆధారాలు చూపించాల్సిందేని స్పష్టం చేస్తున్నారు. ఈ విషయం తెలియక పట్టుకెళుతున్న రైతులు, చిరు వ్యాపారులు సొమ్ములు కోల్పోయి ఇప్పుడు తీవ్రంగా బాధపడుతున్నారు.

రూ.50వేలకు మించి రైతులు పంట పెట్టుబడి, ధాన్యం డబ్బులు తీసుకెళితే సరైన రశీదులు, ఆధారాలు చూపించాల్సిందేనని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. పెళ్లి ఖర్చులకు లక్షలు తీసుకెళ్లే వారు ఖచ్చితంగా తమ వెంట శుభలేఖను వెంట తీసుకొని రావాలని… లేకపోతే సీజ్ చేస్తామని చెబుతున్నారు.

స్వయంగా వీడియోలు తీస్తూ నగదును స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ సొమ్మును రికవరీ చేసుకోవాలంటే మళ్లీ కోర్టుల చుట్టూ తిరగాల్సిందే. అందుకే తెలంగాణలో రూ.50 వేలకు మించి డబ్బులు వెంట తీసుకెళ్లే వారు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

First Published:  15 Oct 2018 8:28 AM GMT
Next Story