Telugu Global
Cinema & Entertainment

ఆదుకున్న వీరరాఘవ.. తేరుకున్న దిల్ రాజు

అరవింద సమేత సినిమా విడుదలైనప్పటి నుంచి అందరి దృష్టి నైజాంమీదే ఉంది. ఈ ఏరియా రైట్స్ ను ఏకంగా 18 కోట్ల రూపాయలకు దక్కించుకున్నాడు దిల్ రాజు. ఈ సినిమా అంత మొత్తాన్ని తిరిగి రాబట్టగలదా అనే సందేహం అందర్లో ఉండేది. మొత్తానికి లాంగ్ వీకెండ్, దసరా సీజన్ కారణంగా అరవింద సమేత నైజాంలో దాదాపు గట్టెక్కింది. నిన్నటి వసూళ్లతో కలుపుకొని అరవింద సమేతకు నైజాంలో 14 కోట్ల 80 లక్షల రూపాయలొచ్చాయి. ఈ ఏరియాలో మరో […]

ఆదుకున్న వీరరాఘవ.. తేరుకున్న దిల్ రాజు
X

అరవింద సమేత సినిమా విడుదలైనప్పటి నుంచి అందరి దృష్టి నైజాంమీదే ఉంది. ఈ ఏరియా రైట్స్ ను ఏకంగా 18 కోట్ల రూపాయలకు దక్కించుకున్నాడు దిల్ రాజు. ఈ సినిమా అంత మొత్తాన్ని తిరిగి రాబట్టగలదా అనే సందేహం అందర్లో ఉండేది. మొత్తానికి లాంగ్ వీకెండ్, దసరా సీజన్ కారణంగా అరవింద సమేత నైజాంలో దాదాపు గట్టెక్కింది.

నిన్నటి వసూళ్లతో కలుపుకొని అరవింద సమేతకు నైజాంలో 14 కోట్ల 80 లక్షల రూపాయలొచ్చాయి. ఈ ఏరియాలో మరో 5 కోట్లు రూపాయలు రావడం పెద్ద సమస్య కాదంటోంది ట్రేడ్. ఎందకంటే దసరా సంబరాలు షురూ అయ్యాయి. మరో వీకెండ్ ఉండనే ఉంది. కాబట్టి.. ఈజీగా బ్రేక్-ఈవెన్ అయిపోవచ్చని భావిస్తున్నాడు దిల్ రాజు.

అన్నింటికంటే దిల్ రాజుకు ఆనందం కలిగించే విషయం ఒకటుంది. అదేంటంటే.. ఫస్ట్ వీకెండ్ లోనే బ్రేక్-ఈవెన్ కు దగ్గరగా రావడం. అదే స్పైడర్ విషయానికొస్తే ఈ సినిమా దిల్ రాజుకు మూడో రోజు నుంచే దెబ్బకొట్టింది. ఫస్ట్ వీకెండ్ తర్వాత థియేటర్లు ఖాళీ. అరవింద సమేత మాత్రం దిల్ రాజును ఆదుకునే దిశగా దూసుకుపోతోంది.

First Published:  16 Oct 2018 7:00 AM GMT
Next Story