మరోసారి మల్టీ స్టారర్ ని ప్రొడ్యూస్ చేయనున్న దిల్ రాజు

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గత ఏడాది ఏకంగా ఆరు హిట్స్ కొట్టి మంచి లాభాలు పొందాడు. కానీ ఈ ఏడాది మాత్రం దిల్ రాజు నుంచి ఒక్క హిట్ కూడా లేదు. ఈ ఏడాది దిల్ రాజు ప్రొడ్యూస్ చేసిన “లవర్” “శ్రీనివాస కళ్యాణం” బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచాయి. ఇప్పుడేమో దసరాకి “హలో గురు ప్రేమకోసమే” అంటూ రామ్ ని హీరోగా పెట్టి సినిమాని రిలీజ్ చేస్తున్నాడు దిల్ రాజు. మరి ఈ సినిమాతో అయిన దిల్ రాజు హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.

ఇదిలా ఉంటే దిల్ రాజు ఇప్పుడు ఒక మల్టీ స్టారర్ సినిమా కోసం స్క్రిప్ట్ రాయిస్తున్నాడు. “సమ్మోహనం” తో హిట్ అందుకున్న మోహన్ కృష్ణ ఇంద్రగంటి ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే మోహన్ కృష్ణ ఇంద్రగంటి దిల్ రాజు సూచనల మేరకు ఒక కథ రెడీ చేసాడని తెలుస్తుంది. దిల్ రాజు కి కూడా ఆ కథ బాగా నచ్చి ఒక ఇరవై రోజుల్లో మోహన్ కృష్ణ ని కథనం కూడా రెడీ చేసుకొని రమ్మనాడు అని టాక్. మరి ఈ మల్టీ స్టారర్ లో ఏ ఇద్దరు హీరోలు కలిసి నటిస్తారు అనేది తెలియాలి అంటే ఇంకొన్ని రోజులు ఆగల్సింది.