Telugu Global
NEWS

విజయ్ హజారే టోర్నీలో తొలి డబుల్ సెంచరీ

ఉత్తరాఖండ్ ఓపెనర్ కర్ణ్ వీర్ కౌశల్ 202 పరుగుల రికార్డు సిక్కింపై 135 బాల్స్ లో 18 బౌండ్రీలు, 9 సిక్సర్లతో మెరుపు డబుల్ సెంచరీ ఉత్తరాఖండ్ ఓపెనర్ల సరికొత్త జాతీయ రికార్డు జాతీయ వన్డే క్రికెట్ చాంపియన్లకు ఇచ్చే విజయ్ హజారే ట్రోఫీ టోర్నీలో…. డబుల్ సెంచరీ సాధించిన తొలి క్రికెటర్ ఘనతను ఉత్తరాఖండ్ ఓపెనర్ కర్ణ్ వీర్ కౌశల్ దక్కించుకొన్నాడు. 2018-19 టోర్నీలో భాగంగా పసికూన సిక్కింతో ముగిసిన మ్యాచ్ లో కర్ణ్ వీర్ కేవలం […]

విజయ్ హజారే టోర్నీలో తొలి డబుల్ సెంచరీ
X
  • ఉత్తరాఖండ్ ఓపెనర్ కర్ణ్ వీర్ కౌశల్ 202 పరుగుల రికార్డు
  • సిక్కింపై 135 బాల్స్ లో 18 బౌండ్రీలు, 9 సిక్సర్లతో మెరుపు డబుల్ సెంచరీ
  • ఉత్తరాఖండ్ ఓపెనర్ల సరికొత్త జాతీయ రికార్డు

జాతీయ వన్డే క్రికెట్ చాంపియన్లకు ఇచ్చే విజయ్ హజారే ట్రోఫీ టోర్నీలో…. డబుల్ సెంచరీ సాధించిన తొలి క్రికెటర్ ఘనతను ఉత్తరాఖండ్ ఓపెనర్ కర్ణ్ వీర్ కౌశల్ దక్కించుకొన్నాడు. 2018-19 టోర్నీలో భాగంగా పసికూన సిక్కింతో ముగిసిన మ్యాచ్ లో కర్ణ్ వీర్ కేవలం 135 బాల్స్ లోనే 202 పరుగుల స్కోరు సాధించాడు.

2007లో పూణే వేదికగా మహారాష్ట్రతో ముగిసిన పోటీలో ముంబై తరపున 187 పరుగుల తో టాప్ స్కోరర్ గా నిలిచిన అజింక్యా రహానే రికార్డును కర్ణ్ వీర్ తెరమరుగు చేశాడు. కర్ణ్ వీర్ డబుల్ సెంచరీలో 18 బౌండ్రీలు, 9 భారీ సిక్సర్లు ఉన్నాయి.

నదియాడ్ లోని జీఎస్ పటేల్ స్టేడియం వేదికగా ముగిసిన ఈ పోటీలో ఉత్తరాఖండ్ ఓపెనర్లు…. కర్ణ్ వీర్- వినీత్ సక్సేనా….. మొదటి వికెట్ కు 50 ఓవర్లలో 296 పరుగుల భాగస్వామ్యం నమోదుచేశారు. చివరకు ఉత్తరాఖండ్ జట్టు 2 వికెట్లకు 366 పరుగుల రికార్డు భాగస్వామ్యం నమోదు చేశారు. విజయ్ హజారే టోర్నీ చరిత్రలో ఇదే మొదటి వికెట్ కు అత్యుత్తమ ఓపెనింగ్ భాగస్వామ్యం కావడం విశేషం.

2007-08 టోర్నీలో పంజాబ్ పై ఢిల్లీ ఓపెనర్లు శిఖర్ ధావన్-ఆకాశ్ చోప్రా నెలకొల్పిన 277 పరుగుల రికార్డును…296 పరుగుల రికార్డుతో ఉత్తరాఖండ్ ఓపెనింగ్ జోడీ అధిగమించారు.

First Published:  16 Oct 2018 7:25 AM GMT
Next Story