తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్న నాని

“దేవదాస్” సినిమాతో మామూలు హిట్ అందుకున్న నాని ప్రస్తుతం “జెర్సీ” సినిమా షూట్ కి రెడీ అవుతున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాని “మళ్ళి రావా” ఫేం గౌతం డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో నాని ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు తెలుస్తుంది.

“జెర్సీ” సినిమాలో తండ్రి కొడుకుల పాత్రల్లో నాని కనిపించబోతున్నాడని పరిశ్రమవర్గాల టాక్. పూర్తీ స్థాయి క్రీడా నేపధ్యంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే మరో సినిమాకి కమిట్ అయ్యాడు. అయితే ఈ సినిమాలో నాని రైతు పాత్రలో కనిపించబోతున్నాడు అని ఫిలిం నగర్ టాక్.

ఎన్నో లఘు సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న కిశోరుడు అనే కొత్త కుర్రాడు ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. పూర్తి స్థాయి గ్రామిన నేపధ్యంతో సాగే ఈ సినిమా మొత్తం నాని రైతుగా దోతి మీద కనిపిస్తాడు అని తెలుస్తుంది. ఈ సినిమా పక్కా నాని కెరీర్ లో ఒక మంచి సినిమాగా నిలిచిపోతుంది అనే నమ్మకంతో నాని ఉన్నాడు.