Telugu Global
National

ప్రశాంత్‌ కిషోరే వారసుడు....

ఇటీవల జేడీయూలో చేరిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ మరో మెట్టు ఎదిగారు. ప్రశాంత్ కిషోర్‌ను జేడీయూ ఉపాధ్యక్షుడిగా బీహర్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నియమించారు. ఇకపై ప్రశాంతే పార్టీ భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయిస్తారని ప్రకటించారు. ప్రశాంత్‌ కిషోర్‌ది పార్టీలో రెండో స్థానమని నేతలకు స్పష్టమైన సందేశం పంపారు. తాజా పరిణామంతో నితీష్‌ తర్వాత ప్రశాంత్‌ కిషోరే జేడీయూను నడిపిస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో మోడీని ప్రధాని కుర్చీపై కూర్చోబెట్టేందుకు వ్యూహ రచనతో […]

ప్రశాంత్‌ కిషోరే వారసుడు....
X

ఇటీవల జేడీయూలో చేరిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ మరో మెట్టు ఎదిగారు. ప్రశాంత్ కిషోర్‌ను జేడీయూ ఉపాధ్యక్షుడిగా బీహర్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నియమించారు.

ఇకపై ప్రశాంతే పార్టీ భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయిస్తారని ప్రకటించారు. ప్రశాంత్‌ కిషోర్‌ది పార్టీలో రెండో స్థానమని నేతలకు స్పష్టమైన సందేశం పంపారు. తాజా పరిణామంతో నితీష్‌ తర్వాత ప్రశాంత్‌ కిషోరే జేడీయూను నడిపిస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు.

2014 సార్వత్రిక ఎన్నికల్లో మోడీని ప్రధాని కుర్చీపై కూర్చోబెట్టేందుకు వ్యూహ రచనతో పాటు, సామాజిక మాధ్యమాల ద్వారా చాపకింద నీరులా ప్రచారం చేయడంలో ప్రశాంత్ కిషోర్ చురుగ్గా పనిచేశారు. ఆ తర్వాత బీజేపీకి దూరంగా జరిగారు.

2015లో బీహార్‌లో జేడీయూ, కాంగ్రెస్, ఆర్జేడీలను ఒక్క తాటి పైకి తెచ్చి ఆ కూటమి నెగ్గడంలో సాయపడ్డారు. అప్పటి నుంచే నితీష్, ప్రశాంత్ కిషోర్ ల మధ్య బంధం మరింత బలపడింది.

తాజాగా ప్రశాంత్‌కు పార్టీలో రెండో స్థానం కట్టబెట్టడం ద్వారా కుటుంబ రాజకీయాలకు నితీష్‌ చరమగీతం పాడారని జేడీయూ నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం ఏపీలో వైసీపీ తరపున ప్రశాంత్ కిషోర్ టీం పనిచేస్తోంది.

First Published:  16 Oct 2018 7:20 AM GMT
Next Story