Telugu Global
Cinema & Entertainment

సాహో సినిమా సమ్మర్ కు రావడం లేదు

ప్రభాస్ హీరోగా నటిస్తున్న సాహో సినిమా వచ్చే ఏడాది సమ్మర్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి వస్తుందని అంతా భావిస్తున్నారు. కానీ ఈ సినిమా వేసవికి రావడం లేదు. వేసవి బరిలో చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డితో పాటు మహేష్ చేస్తున్న మహర్షి సినిమా ఉండడంతో సాహోను వాయిదా వేశారు. కేవలం వాయిదా వేయడమే కాదు, సాహో రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు. వచ్చే ఏడాది ఆగస్ట్ 15న సాహో సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. నిజానికి ఈ […]

సాహో సినిమా సమ్మర్ కు రావడం లేదు
X
ప్రభాస్ హీరోగా నటిస్తున్న సాహో సినిమా వచ్చే ఏడాది సమ్మర్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి వస్తుందని అంతా భావిస్తున్నారు. కానీ ఈ సినిమా వేసవికి రావడం లేదు. వేసవి బరిలో చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డితో పాటు మహేష్ చేస్తున్న మహర్షి సినిమా ఉండడంతో సాహోను వాయిదా వేశారు.
కేవలం వాయిదా వేయడమే కాదు, సాహో రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు. వచ్చే ఏడాది ఆగస్ట్ 15న సాహో సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. నిజానికి ఈ సినిమా ఫిబ్రవరి నాటికి రెడీ అయిపోతుంది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కోసం టైమ్ తీసుకోవాలని నిర్ణయించారు. పైగా మహేష్, చిరంజీవి సినిమాల తాకిడి కూడా ఉండడంతో సాహోను ఆగస్ట్ 15కు పోస్ట్ పోన్ చేశారు.
సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది సాహో సినిమా. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై దాదాపు 150 కోట్ల రూపాయల బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రద్ధాకపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఒకేసారి తెలుగు-తమిళ-హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయాలనేది టార్గెట్.
First Published:  15 Oct 2018 9:45 PM GMT
Next Story