Telugu Global
NEWS

నా కొడుకు పిలుపునిస్తేనే ఆరు వేల బైకులొచ్చాయి " సోమిరెడ్డి

ప్రతి రెండేళ్ల కొకసారి పవన్‌ కల్యాణ్ వ్యక్తిత్వం మారిపోతున్నట్టుగా ఉందని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి విమర్శించారు. 14 ఏళ్ల వయసులో అహింసవాదిగా మారానని చెప్పిన పవన్‌ కల్యాణ్…. మరో చోట మాత్రం 17 ఏళ్లకే నక్సలైట్‌ అవుదామనుకున్నానని చెప్పారని గుర్తు చేశారు. మరోసారి ఎస్‌ఐ అవుదామనుకున్నాను…. ఒకవేళ అలా కాకపోతే చిరంజీవికి సెక్యూరిటీ గార్డ్ అవుదామనుకున్నా…. అని పవన్‌ కల్యాణే చెప్పారన్నారు సోమిరెడ్డి. అసలు పవన్‌ కల్యాణ్ చెబుతున్న ఈ విషయాలన్నీ ప్రజలకు ఏం అవసరమని […]

నా కొడుకు పిలుపునిస్తేనే ఆరు వేల బైకులొచ్చాయి  సోమిరెడ్డి
X

ప్రతి రెండేళ్ల కొకసారి పవన్‌ కల్యాణ్ వ్యక్తిత్వం మారిపోతున్నట్టుగా ఉందని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి విమర్శించారు. 14 ఏళ్ల వయసులో అహింసవాదిగా మారానని చెప్పిన పవన్‌ కల్యాణ్…. మరో చోట మాత్రం 17 ఏళ్లకే నక్సలైట్‌ అవుదామనుకున్నానని చెప్పారని గుర్తు చేశారు. మరోసారి ఎస్‌ఐ అవుదామనుకున్నాను…. ఒకవేళ అలా కాకపోతే చిరంజీవికి సెక్యూరిటీ గార్డ్ అవుదామనుకున్నా…. అని పవన్‌ కల్యాణే చెప్పారన్నారు సోమిరెడ్డి. అసలు పవన్‌ కల్యాణ్ చెబుతున్న ఈ విషయాలన్నీ ప్రజలకు ఏం అవసరమని ప్రశ్నించారు.

అన్న ప్రజారాజ్యం పెడితే యువరాజ్యం అధ్యక్షుడిగా పనిచేసిన పవన్ కల్యాణ్‌ వారసత్వ రాజకీయం గురించి మాట్లాడడం ఏమిటని నిలదీశారు. అసలు చిరంజీవి వారసత్వం లేకుంటే పవన్‌ కల్యాణ్ ఎక్కడుండేవారని ప్రశ్నించారు. సర్పంచ్‌ కూడా కాని లోకేష్ మంత్రి అయ్యారని పవన్ చేసిన విమర్శలపైనా సోమిరెడ్డి మండిపడ్డారు. మరి ప్రజారాజ్యం పెట్టినప్పుడు చిరంజీవి సర్పంచ్‌గా గెలిచారా… ఏ అర్హతతో సీఎం కావాలనుకున్నారో చెప్పాలన్నారు.

పవన్‌ కల్యాణ్‌ భాష అంతా హింసాత్మకంగానే ఉందన్నారు. ఉత్తరాంధ్రకు సూర్యుడిలా అండగా ఉంటానన్న పవన్‌ కల్యాణ్.. ఆ ప్రాంతం తుపానులో చిక్కుకుని అల్లాడుతుంటే ఈయన మాత్రం కోట్లు ఖర్చు పెట్టి కవాతులు చేస్తారా? అని ప్రశ్నించారు. సినిమా పరిశ్రమకు చెందిన కమెడియన్‌ వచ్చినా జనం వస్తారన్నారు. తన కుమారుడు ఇటీవల బైక్ ర్యాలీకి పిలుపునిస్తే రెండు రోజుల్లోనే ఆరువేల బైకులు వచ్చాయని సోమిరెడ్డి చెప్పారు. ఆ ఫొటోలు కూడా ఉన్నాయన్నారు.

పవన్‌ కల్యాణ్‌ను జనం సినిమా యాక్టర్‌గా చూస్తున్నారా లేక పొలిటికల్ యాక్టర్‌గా చూస్తున్నారా అన్నది తెలుసుకోవాలన్నారు. పవన్‌ కల్యాణ్ సీఎం కావాలనుకుంటే తమకు అభ్యంతరం లేదని.. కానీ వాడే భాష సరిగా ఉండాలన్నారు. పవన్‌ కల్యాణ్‌ వచ్చి టీడీపీని గెలిపించడం ఏమిటని ప్రశ్నించారు. సీఎం అవుతాననే వ్యక్తి…. సభకు వచ్చిన వారిని తనను సీఎం అని పిలవాల్సిందిగా అడుక్కోవడం ఏమిటన్నారు. మంత్రిగా లోకేష్ పనితీరుకు 19 అవార్డులు వచ్చాయన్నారు.

పవన్‌ స్పీచ్‌ ని బట్టి ఆయనకు మెచూరిటీ ఉందా లేదా అన్నది తేలిపోతోందన్నారు. ఎస్టీ రిజర్వ్‌డ్ అయిన పాడేరు నుంచి పోటీ చేస్తానని పవన్‌ కల్యాణ్ చెప్పడాన్ని బట్టే ఆయన అవగాహన ఏపాటిదో అర్థమవుతోందన్నారు. మాట్లాడే ముందు గతంలో తాను ఏం మాట్లాడాడో ఒకసారి గుర్తుకు తెచ్చుకుని ప్రసంగం చేయాలని పవన్‌ కల్యాణ్‌కు సోమిరెడ్డి సూచించారు. అసలు రాజకీయనాయకుడికి బౌన్సర్లు ఎందుకని ప్రశ్నించారు. పవన్‌ కల్యాణ్‌కు ప్రాణహాని రాజకీయంగా ఉందో లేక వ్యక్తిగతంగా ఉందో చెప్పాలన్నారు.

First Published:  16 Oct 2018 2:50 AM GMT
Next Story