తెలుగు సినిమాల పై షాకింగ్ కామెంట్స్ చేసిన తాప్సీ

తెలుగు సినిమాలతో ఇండస్ట్రీ కి పరిచయమైన తాప్సీ ఆ తరువాత అవకాశాలు రావడంతో బాలీవుడ్ కి వెళ్ళింది. కానీ అక్కడికి వెళ్లి రెండు మూడు హిట్స్ కొట్టిందో లేదో తెలుగు సినిమాలపై నెగటివ్ గా మాట్లాడుతోంది తాప్సీ. అసలు తెలుగు సినిమాల్లో మంచి పాత్రలు దక్కవు… అన్నీ హాట్ రోల్స్ వస్తాయి… అది నాకు అస్సలు ఇష్టం ఉండదు అంటూ చెప్తుంది.

అయితే తెలుగులో తాప్సీ చేసినవన్నీ అల్ట్రా మోడ్రన్ అని చెప్పుకునే హాట్ అండ్ స్పైసీ పాత్రలే. తమిళ చిత్రాల్లోనూ దాదాపుగా అవే రోల్స్ చేసింది. ఇక బాలీవుడ్‌కు వెళ్లాక తాప్సీ కొంత మారిపోయింది. అక్కడ ఆమెకు మంచి పాత్రలే  దొరుకుతున్నాయి.

ఇక తెలుగులో తాప్సీ గ్లామరస్ హీరోయిన్‌గా రాణించిందే తప్ప ఏ సినిమాలోనూ నటిగా మంచి మార్కులు వేయించుకోలేకపోయింది. ఆమె నటన అంతంత మాత్రంగా ఉండడంతో గ్లామరస్ పాత్రలకే తాప్సీని పరిమితం చేసేశారు తెలుగు దర్శకనిర్మాతలు. అయితే ఈ భామ సౌత్ అనగానే తనకు అల్ట్రా గ్లామరస్, బోల్డ్ పాత్రలే గుర్తుకు వస్తాయని చెప్పింది. ఇక బాలీవుడ్‌లో అయితే కొత్త కొత్త ఆలోచనలతో సినిమాలు వస్తాయని అందుకే బాలీవుడ్ లో హిట్స్ తో దూసుకుపోతున్నాను అని చెప్పింది తాప్సీ.