Telugu Global
NEWS

క్రికెటర్ల భార్యలకు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్

టూర్ మొదటి 10 రోజులు మినహా అనుమతి విదేశీ పర్యటనలకు ఇక క్రికెటర్ల భార్య, కుటుంబసభ్యులు విదేశీ పర్యటనల సమయంలో టీమిండియా క్రికెటర్లతో పాటు …భార్య లేదా గాళ్ ఫ్రెండ్స్ ను అనుమతించాలంటూ కెప్టెన్ విరాట్ కొహ్లీ చేసిన అభ్యర్ధనను…బీసీసీఐ పాలకమండలి ఆమోదించింది. అయితే…విదేశీ టూర్ల మొదటి పదిరోజులపాటు మాత్రం అనుమతించేది లేదని…ఆ తర్వాత నుంచి పర్యటన మొత్తం కాలం…తమతో ఉండిపోవచ్చునని వినోద్ రాయ్ నేతృత్వంలోని పాలకమండలి వివరణ ఇచ్చింది. ఇంతకు ముందు వరకూ… విదేశీ పర్యటనల […]

క్రికెటర్ల భార్యలకు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్
X
  • టూర్ మొదటి 10 రోజులు మినహా అనుమతి
  • విదేశీ పర్యటనలకు ఇక క్రికెటర్ల భార్య, కుటుంబసభ్యులు

విదేశీ పర్యటనల సమయంలో టీమిండియా క్రికెటర్లతో పాటు …భార్య లేదా గాళ్ ఫ్రెండ్స్ ను అనుమతించాలంటూ కెప్టెన్ విరాట్ కొహ్లీ చేసిన అభ్యర్ధనను…బీసీసీఐ పాలకమండలి ఆమోదించింది.

అయితే…విదేశీ టూర్ల మొదటి పదిరోజులపాటు మాత్రం అనుమతించేది లేదని…ఆ తర్వాత నుంచి పర్యటన మొత్తం కాలం…తమతో ఉండిపోవచ్చునని వినోద్ రాయ్ నేతృత్వంలోని పాలకమండలి వివరణ ఇచ్చింది.

ఇంతకు ముందు వరకూ… విదేశీ పర్యటనల సమయంలో క్రికెటర్లు లేదా కోచ్ లు, సహాయక సిబ్బందితో పాటు వారి భార్య లేదా స్నేహితురాళ్లను…కేవలం రెండువారాలపాటు మాత్రమే అనుమతించేవారు.

అయితే ..రెండు లేదా మూడుమాసాలపాటు పర్యటనలు సాగే సమయంలో… ఎక్కువకాలం…కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాల్సి రావడం ఇబ్బందిగా ఉందంటూ…ఆటగాళ్ల తరపున విరాట్ కొహ్లీ… బోర్డు పెద్దలకు తమ విజ్ఞాపన పత్రాన్ని అందచేశాడు.

మొదటి 10రోజులే దూరం…

సుదీర్ఘంగా సాగే విదేశీ పర్యటనల్లో …మొదటి పదిరోజులు మాత్రం క్రికెటర్లతో పాటు వారి కుటుంబసభ్యులను అనుమతించేది లేదని… ఆ తర్వాత నుంచి పర్యటన పూర్తయ్యే వరకూ అనుమతిస్తామని బీసీసీఐ వర్గాలు ప్రకటించాయి.

వచ్చే నెలలో ప్రారంభమయ్యే ఆస్ట్రేలియా పర్యటన నుంచే ఈ నిబంధన అమలులోకి రానుంది. 2015 నుంచే క్రికెట్ ఆస్ట్రేలియా ఈ నిబంధనను అమలు చేస్తూ వస్తోంది.

తోడుంటేనే ఉత్తమఫలితాలు…

ఎనిమిది లేదా పన్నెండువారాలపాటు సాగే విదేశీ పర్యటనల్లో సహాయక సిబ్బందితో పాటు…క్రికెటర్ల కుటుంబసభ్యులు సైతం తోడుగా ఉంటే….అత్యుత్తమ ఫలితాలు సాధించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

భారత ప్రస్తుత స్టార్ క్రికెటర్లలో విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మ, అజింక్యా రహానే, శిఖర్ ధావన్, దినేశ్ కార్తీక్…తమ భార్యలతో తరచూ విదేశీ పర్యటనలకు వెళుతున్న సంగతి తెలిసిందే.

First Published:  17 Oct 2018 10:23 AM GMT
Next Story