Telugu Global
National

నేను గాని వస్తే పడే ఓట్లు కూడా పడవ్ " దిగ్విజయ్ వీడియో హల్‌చల్

తొందరపాటు చర్యలతో తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్న కాంగ్రెస్ సీనియర్‌ నేత దిగ్విజయ్ సింగ్‌ ఇప్పుడు మరోసారి హాట్ టాఫిక్ అయ్యారు. మధ్యప్రదేశ్‌కు పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన ఇటీవల కార్యకర్తల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌ను ఇబ్బందిపెడుతున్నాయి. మధ్యప్రదేశ్‌కు సుధీర్ఘకాలం ముఖ్యమంత్రిగా చేసిన దిగ్విజయ్ సింగ్‌ అక్కడి అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి మాత్రం రావడం లేదు. ఆయన్ను కాంగ్రెస్‌ దూరంగా పెట్టిందన్న ప్రచారం సాగింది. అయితే సరిగ్గా రాహుల్‌ గాంధీ మధ్యప్రదేశ్‌ ఎన్నికల ప్రచార పర్యటన […]

నేను గాని వస్తే పడే ఓట్లు కూడా పడవ్  దిగ్విజయ్ వీడియో హల్‌చల్
X

తొందరపాటు చర్యలతో తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్న కాంగ్రెస్ సీనియర్‌ నేత దిగ్విజయ్ సింగ్‌ ఇప్పుడు మరోసారి హాట్ టాఫిక్ అయ్యారు. మధ్యప్రదేశ్‌కు పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన ఇటీవల కార్యకర్తల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌ను ఇబ్బందిపెడుతున్నాయి.

మధ్యప్రదేశ్‌కు సుధీర్ఘకాలం ముఖ్యమంత్రిగా చేసిన దిగ్విజయ్ సింగ్‌ అక్కడి అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి మాత్రం రావడం లేదు. ఆయన్ను కాంగ్రెస్‌ దూరంగా పెట్టిందన్న ప్రచారం సాగింది. అయితే సరిగ్గా రాహుల్‌ గాంధీ మధ్యప్రదేశ్‌ ఎన్నికల ప్రచార పర్యటన సమయంలో ఒక వీడియో బయటకు వచ్చింది.

”నేను ప్రచారంలో పాల్గొనను, ఎలాంటి ప్రసంగాలు చేయను. ఇలా మౌనంగా ఉండడమే ఇప్పుడు నా పని. నేను గనుక మాట్లాడితే కాంగ్రెస్‌కు పడాల్సిన ఓట్లు కూడా పడవు. అలాంటి నష్టం నావల్ల ఎందుకు జరగనిస్తాను. అందుకే మౌనంగా ఉంటున్నా. ప్రచారానికి దూరంగా ఉండటమే మేలు అనుకుంటున్నా” అంటూ సదరు వీడియోలో దిగ్విజయ్ సింగ్ వివరించారు. ఈ వీడియోపై దిగ్విజయ్‌ స్పందించారు.

తాను కార్యకర్తల సమావేశంలో అనేక అంశాలు మాట్లాడానని…. ఆ సమయంలో సందర్భాన్ని బట్టి కొన్నివ్యాఖ్యలు చేశానని చెప్పారు. ఆ మాటలను పట్టుకుని ఏదో జరిగిపోయినట్టు ప్రచారం చేయడం సరికాదన్నారు. బీజేపీ మాత్రం ఈ వీడియో ఆధారంగా కాంగ్రెస్‌పై దాడికి దిగింది. పదేళ్ల పాటు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒక సీనియర్‌ నేతకు కాంగ్రెస్‌లో ఎలాంటి మర్యాద దక్కుతోందో ఈ వీడియోను బట్టి తెలుస్తోందని బీజేపీ వ్యాఖ్యానించింది.

First Published:  16 Oct 2018 11:15 PM GMT
Next Story