Telugu Global
Cinema & Entertainment

కామెడీ మిస్ ఫైర్ అయితే పరిస్థితేంటి?

హలో గురు ప్రేమ కోసమే.. రామ్-అనుపమ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా. ఈ మూవీకి సంబంధించి యూనిట్ మొత్తం ప్రమోషన్ లో చెబుతున్న ఎలిమెంట్ ఒకటే. సినిమాలో కామెడీ అదిరిపోద్దనే మాటే చెబుతున్నారు. అంతకుమించి మూవీలో ఎట్రాక్షన్స్ గురించి చెప్పడం లేదు. అంటే టోటల్ యూనిట్ అంతా కామెడీపైనే ఆశలుపెట్టుకొని సినిమాను వదుల్తున్నారన్నమాట. కామెడీ అనేది రెండు వైపుల పదునున్న కత్తిలాంటిది. ఏమాత్రం తేడాకొట్టినా రిజల్ట్ రివర్స్ అవుతుంది. కామెడీ కుదిరితే ఈ దసరాకు ఇదే సిసలైన మూవీగా […]

కామెడీ మిస్ ఫైర్ అయితే పరిస్థితేంటి?
X

హలో గురు ప్రేమ కోసమే.. రామ్-అనుపమ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా. ఈ మూవీకి సంబంధించి యూనిట్ మొత్తం ప్రమోషన్ లో చెబుతున్న ఎలిమెంట్ ఒకటే. సినిమాలో కామెడీ అదిరిపోద్దనే మాటే చెబుతున్నారు. అంతకుమించి మూవీలో ఎట్రాక్షన్స్ గురించి చెప్పడం లేదు. అంటే టోటల్ యూనిట్ అంతా కామెడీపైనే ఆశలుపెట్టుకొని సినిమాను వదుల్తున్నారన్నమాట.

కామెడీ అనేది రెండు వైపుల పదునున్న కత్తిలాంటిది. ఏమాత్రం తేడాకొట్టినా రిజల్ట్ రివర్స్ అవుతుంది. కామెడీ కుదిరితే ఈ దసరాకు ఇదే సిసలైన మూవీగా నిలుస్తుంది. అదే కామెడీ వెగటుపుట్టిస్తే మాత్రం రామ్ ఖాతాలో మరో ఫ్లాప్ మూవీ చేరిపోతుంది. నవ్వుకోవడానికి కామెడీ ఎంత బాగుంటుందో, ఇదే ఫార్ములాను నమ్ముకొని సినిమా చేయడం కూడా అంతే రిస్క్.

పైగా ఈ సినిమా అటు రామ్, అనుపమతో పాటు ఇటు నిర్మాత దిల్ రాజుకు కూడా చాలా ఇంపార్టెంట్. మరోవైపు థియేటర్లలో అరవింద సమేత ఉండనే ఉంది. వసూళ్ల సంగతి పక్కనపెడితే, ఉన్న థియేటర్లలోంచి అరవిందను లేపి, రామ్ కు ఇవ్వడం అసంభవం. అంటే లిమిటెడ్ థియేటర్లలోనే అదృష్టాన్ని పరీక్షించుకోవాలన్నమాట. రేపు థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమా రామ్, అనుపమ, దిల్ రాజుకు ఏ రేంజ్ లో కలిసొస్తుందో చూడాలి

First Published:  17 Oct 2018 4:10 AM GMT
Next Story