Telugu Global
NEWS

విజయ్ హజారే ట్రోఫీ సెమీస్ లో హైదరాబాద్ కు ముంబై దెబ్బ

వన్డే లోనూ పృథ్వీ షా అదే జోరు హైదరాబాద్ పై ముంబై 60 పరుగుల విజయం పృథ్వీ షా 61 పరుగులు, శ్రేయస్ అయ్యర్ 55 నాటౌట్ జాతీయ వన్డే క్రికెట్ చాంపియన్లకు ఇచ్చే విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్స్ కు చేరడంలో… హైదరాబాద్ విఫలమయ్యింది. తొలిసారిగా సెమీస్ చేరిన హైదరాబాద్ ఆనందం… ముంబై చేతిలో ఓటమితో ఆవిరయ్యింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా ముగిసిన తొలి సెమీఫైనల్ మ్యాచ్.. వర్షం దెబ్బతో నిలిచిపోడంతో… డక్ వర్త్ […]

విజయ్ హజారే ట్రోఫీ సెమీస్ లో హైదరాబాద్ కు ముంబై దెబ్బ
X
  • వన్డే లోనూ పృథ్వీ షా అదే జోరు
  • హైదరాబాద్ పై ముంబై 60 పరుగుల విజయం
  • పృథ్వీ షా 61 పరుగులు, శ్రేయస్ అయ్యర్ 55 నాటౌట్

జాతీయ వన్డే క్రికెట్ చాంపియన్లకు ఇచ్చే విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్స్ కు చేరడంలో… హైదరాబాద్ విఫలమయ్యింది. తొలిసారిగా సెమీస్ చేరిన హైదరాబాద్ ఆనందం… ముంబై చేతిలో ఓటమితో ఆవిరయ్యింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా ముగిసిన తొలి సెమీఫైనల్ మ్యాచ్.. వర్షం దెబ్బతో నిలిచిపోడంతో… డక్ వర్త్ లూయిస్ విధానం ద్వారా ముంబై 60 పరుగుల తేడాతో విజేతగా నిలిచింది.

రోహిత్ రాయుడు ఫైటింగ్ సెంచరీ…
50 పరిమిత ఓవర్ల ఈ పోటీ లో టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ ఎంచుకొన్న హైదరాబాద్ జట్టు… 8 వికెట్లకు 246 పరుగులు మాత్రమే చేయగలిగింది. వన్ డౌన్ రోహిత్ రాయుడు 121 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.


సమాధానంగా 247 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన ముంబై 25 ఓవర్లలో 2 వికెట్లకు 155 పరుగుల స్కోరు సాధించిన సమయంలో కుండపోతగా వర్షం పడడంతో మ్యాచ్ నిలిచిపోయింది.

ఓపెనర్ పృథ్వీ షా 44 బాల్స్ లో 8 బౌండ్రీలు, 2 సిక్సర్లతో 61 పరుగులకు అవుట్ కాగా… శ్రేయస్ అయ్యర్ 53 బాల్స్ లో 5 బౌండ్రీలు, 2 సిక్సర్లతో 55 పరుగుల స్కోరుతో నాటౌట్ గా నిలిచాడు. హైదరాబాద్ బౌలర్లలో మెహిదీ హసన్ 23 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.

First Published:  17 Oct 2018 7:52 AM GMT
Next Story