Telugu Global
Cinema & Entertainment

చైతూ చేసిన తప్పును రిపీట్ చేస్తున్న సుమంత్

మొన్నటికి మొన్న నాగచైతన్య సినిమాల విషయంలో ఏం జరిగిందో చూశాం. ఒకేసారి రెండు సినిమాలు రిలీజ్ చేశాడు చైతూ. అటు సవ్యసాచి, ఇటు శైలజారెడ్డి అల్లుడు రెండూ రెడీ అయిపోయాయి. దీంతో పోటీపడి మరీ నిర్మాతలు రిలీజ్ డేట్స్ ఎనౌన్స్ చేశారు. మధ్యలో నాగచైతన్య లాక్ అయిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు సుమంత్ కూడా సరిగ్గా ఇలాంటి చిక్కుల్లోనే పడ్డాడు. మళ్లీ రావా సినిమాతో ఎట్టకేలకు ఓ సక్సెస్ కొట్టిన సుమంత్, ఆ ఊపులో ఒకేసారి 2 సినిమాలు […]

చైతూ చేసిన తప్పును రిపీట్ చేస్తున్న సుమంత్
X

మొన్నటికి మొన్న నాగచైతన్య సినిమాల విషయంలో ఏం జరిగిందో చూశాం. ఒకేసారి రెండు సినిమాలు రిలీజ్ చేశాడు చైతూ. అటు సవ్యసాచి, ఇటు శైలజారెడ్డి అల్లుడు రెండూ రెడీ అయిపోయాయి. దీంతో పోటీపడి మరీ నిర్మాతలు రిలీజ్ డేట్స్ ఎనౌన్స్ చేశారు. మధ్యలో నాగచైతన్య లాక్ అయిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు సుమంత్ కూడా సరిగ్గా ఇలాంటి చిక్కుల్లోనే పడ్డాడు.

మళ్లీ రావా సినిమాతో ఎట్టకేలకు ఓ సక్సెస్ కొట్టిన సుమంత్, ఆ ఊపులో ఒకేసారి 2 సినిమాలు స్టార్ట్ చేశాడు. సినిమాలైతే స్టార్ట్ చేశాడు కానీ గ్యాప్ ఇవ్వలేకపోయాడు. ఫలితంగా అతడు నటించిన ఇదం జగత్, సుబ్రహ్మణ్యపురం సినిమాలు రెండూ ఒకేసారి రెడీ అయిపోయాయి.

సినిమాలు సిద్ధమవ్వడంతో ఇప్పుడు నిర్మాతల మధ్య పోటీ మొదలైంది. నవంబర్ లోనే వచ్చేస్తున్నామంటూ రెండు సినిమాల నిర్మాతలు పోస్టర్ల మీద పోస్టర్లు రిలీజ్ చేస్తున్నారు. వీరి పోటీకి మరింత ఆద్యం పోస్తూ, సుమంత్ కూడా నవంబర్ లోనే వచ్చేస్తున్నామంటూ ట్వీట్ చేయడం వేడిని మరింత పెంచింది.

మళ్లీ రావా సక్సెస్ ను క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ రెండు సినిమాల్లో ఏదీ తగ్గడం లేదు. చూస్తుంటే.. వారం గ్యాప్ లోనే రెండూ థియేటర్లలోకి వచ్చేట్టున్నాయి. అసలే సుమంత్ కు మార్కెట్ అంతంతమాత్రం. ఇప్పుడిలా ఒకేసారి 2 థియేటర్లలోకి వస్తే అతడి మార్కెట్ కు ఇది మరింత అవరోధం.

First Published:  17 Oct 2018 3:33 AM GMT
Next Story