Telugu Global
NEWS

మహిళా క్రికెట్ చరిత్రలో ప్రపంచ రికార్డు

571 పరుగుల విజయంతో సరికొత్త చరిత్ర దక్షిణ ఆస్ట్రేలియా ప్రీమియర్ లీగ్ లో సంచలనం జెంటిల్మెన్ గేమ్ క్రికెట్లో ఒక్క పరుగు నుంచి 300 పరుగుల విజయాల వరకూ మనకు తెలుసు. అయితే …మహిళా క్రికెట్లో ఓ జట్టు ఏకంగా 571 పరుగుల భారీ విజయంతో సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది.  సౌత్ ఆస్ట్రేలియా క్రికెట్ సంఘం ప్రీమియర్ లీగ్ లో భాగంగా… పోర్ట్ అడిలైడ్ జట్టుతో ముగిసిన పోటీలో నార్ధర్న్ డిస్ట్రిక్ట్ జట్టు 571 పరుగుల […]

మహిళా క్రికెట్ చరిత్రలో ప్రపంచ రికార్డు
X
  • 571 పరుగుల విజయంతో సరికొత్త చరిత్ర
  • దక్షిణ ఆస్ట్రేలియా ప్రీమియర్ లీగ్ లో సంచలనం

జెంటిల్మెన్ గేమ్ క్రికెట్లో ఒక్క పరుగు నుంచి 300 పరుగుల విజయాల వరకూ మనకు తెలుసు. అయితే …మహిళా క్రికెట్లో ఓ జట్టు ఏకంగా 571 పరుగుల భారీ విజయంతో సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది.

సౌత్ ఆస్ట్రేలియా క్రికెట్ సంఘం ప్రీమియర్ లీగ్ లో భాగంగా… పోర్ట్ అడిలైడ్ జట్టుతో ముగిసిన పోటీలో నార్ధర్న్ డిస్ట్రిక్ట్ జట్టు 571 పరుగుల తేడాతో విజేతగా నిలిచింది.

పరుగుల వెల్లువలా సాగిన ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన నార్దర్న్ డిస్ట్రిక్ట్ జట్టు…50 ఓవర్లలో 3 వికెట్లకు 596 పరుగుల స్కోరు సాధించింది. ఏకంగా నలుగురు నార్ధర్న్ ప్లేయర్లు సెంచరీలు సాధించారు.

సమాధానంగా 572 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన పోర్ట్ అడిలైడ్ జట్టు…10.5 ఓవర్లలో 25 పరుగులకే కుప్పకూలింది. మహిళా క్రికెట్ చరిత్రలోనే ఇదే అతిపెద్ద విజయంగా రికార్డుల్లో చేరింది.

First Published:  16 Oct 2018 7:24 PM GMT
Next Story