Telugu Global
NEWS

తుఫాను మాటున బాబు పబ్లిసిటీ

ఎక్కడ రాజీపడినా పబ్లిసిటీలో మాత్రం రాజీ పడే నైజం లేని ముఖ్యమంత్రి చంద్రబాబు.. మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. సంక్షోభంలోనూ అవకాశాలు వెతుక్కోవాలనే  బాబు… మొన్నటి తుఫానును కూడా  పబ్లిసిటీకి వాడేసి అవురా అనిపిస్తున్నారు. తుఫాను వచ్చిపోయి వారం గడుస్తున్నా ఇప్పటికీ అక్కడ మంచినీళ్లు కూడా దొరకడం లేదు. ఆహారం కూడా అందడం లేదు. బాధిత ప్రాంతంలో పరిస్థితి అలా ఉంటే బయటిప్రపంచానికి మాత్రం తుఫాను తాట తీసేసామని  నమ్మించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రాజధాని అమరావతిలో వెలసిన ఫ్లెక్సీలను […]

తుఫాను మాటున బాబు పబ్లిసిటీ
X

ఎక్కడ రాజీపడినా పబ్లిసిటీలో మాత్రం రాజీ పడే నైజం లేని ముఖ్యమంత్రి చంద్రబాబు.. మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. సంక్షోభంలోనూ అవకాశాలు వెతుక్కోవాలనే బాబు… మొన్నటి తుఫానును కూడా పబ్లిసిటీకి వాడేసి అవురా అనిపిస్తున్నారు.

తుఫాను వచ్చిపోయి వారం గడుస్తున్నా ఇప్పటికీ అక్కడ మంచినీళ్లు కూడా దొరకడం లేదు. ఆహారం కూడా అందడం లేదు. బాధిత ప్రాంతంలో పరిస్థితి అలా ఉంటే బయటిప్రపంచానికి మాత్రం తుఫాను తాట తీసేసామని నమ్మించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రాజధాని అమరావతిలో వెలసిన ఫ్లెక్సీలను చూస్తే ఆ సంగతి అర్థమవుతుంది. అమరావతి ప్రాంతంలో ప్రధాన రహదారుల వెంట భారీగా ఫ్లెక్సీలు వేశారు.

చంద్రబాబు తుపాను ప్రాంతాన్ని బాగు చేశారు… భారీగా సాయం చేసి బాధితులను ఆదుకున్నారంటూ పెద్దపెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనకు చంద్రబాబు ఇటీవల వెళ్లగా అక్కడ బాధితులు బాబు బస్సును చుట్టుముట్టి ఘెరావ్ చేశారు. అయితే ఆ ఫోటోనే ఫ్లెక్సీలపై ముద్రించి వారంతా చంద్రబాబును మెచ్చుకున్నారని ప్రచారం చేస్తున్నారు.

తుఫాను ప్రాంతంపై ఫోకస్ పెట్టడం మానేసి ప్రభుత్వ ఖర్చుతోనే ఇలా ప్రచారానికి, అది కూడా బాధిత ప్రాంతంలో కాకుండా రాజధాని ప్రాంతంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం చూసి జనం నవ్వుకుంటుకున్నారు. తుఫాను బాధితులకు ప్రభుత్వం కొండంత అండ పేరుతో ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసారు.

First Published:  17 Oct 2018 8:07 PM GMT
Next Story