Telugu Global
NEWS

ఆ వ్యూహం పనికిరాదని బాబుకు అర్థమైందా?

ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో చెట్టాపట్టాలేసుకుని సాగుతున్నాడు చంద్రబాబు నాయుడు. తెలంగాణలో అయితే ఈ బంధం ఖరారు అయ్యింది. ఇక ఈ బంధం ఏపీలో కూడా కొనసాగుతుందని చాన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు ఈ సారి తన అవకాశవాద చాప్టర్లో కాంగ్రెస్ తో జతకట్టడం ఖాయమని ప్రచారం జరుగుతూ ఉంది. ఈ విషయాన్ని చంద్రబాబు అధికారికంగా ధ్రువీకరించకుండా అనధికారికంగా లీకులు ఇప్పించుకున్నాడు. ఒకవైపు తెలుగుదేశం పార్టీ ఏపీలో కూడా కాంగ్రెస్ తో జత కడుతుందనే వార్తలు ఒకవైపు […]

ఆ వ్యూహం పనికిరాదని బాబుకు అర్థమైందా?
X

ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో చెట్టాపట్టాలేసుకుని సాగుతున్నాడు చంద్రబాబు నాయుడు. తెలంగాణలో అయితే ఈ బంధం ఖరారు అయ్యింది. ఇక ఈ బంధం ఏపీలో కూడా కొనసాగుతుందని చాన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు ఈ సారి తన అవకాశవాద చాప్టర్లో కాంగ్రెస్ తో జతకట్టడం ఖాయమని ప్రచారం జరుగుతూ ఉంది. ఈ విషయాన్ని చంద్రబాబు అధికారికంగా ధ్రువీకరించకుండా అనధికారికంగా లీకులు ఇప్పించుకున్నాడు.

ఒకవైపు తెలుగుదేశం పార్టీ ఏపీలో కూడా కాంగ్రెస్ తో జత కడుతుందనే వార్తలు ఒకవైపు లీకులుగా ఇచ్చి, మరోవైపు ఆ పొత్తు వద్దని తన పార్టీ వాళ్ల చేతే చెప్పిస్తూ చంద్రబాబు నాయుడు రాజకీయం చేస్తున్నాడు.

అయితే.. ఇప్పుడు మాత్రం తెలుగుదేశం వర్గాలు కాంగ్రెస్ తో పొత్తు ఉండదన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాయి. ఒక దశలో కాంగ్రెస్ తో పొత్తు విషయాన్ని ఖండించిన నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా లీకులిచ్చిన చంద్రబాబు నాయుడు…. ఇప్పుడు మాత్రం పొత్తే ఉండదన్నట్టుగా లీకులిస్తున్నాడు. ఇవి కొత్త లీకులు.

ఇంతకీ అసలు సంగతేమిటి? అంటే.. పచ్చ పార్టీ అధినేత ఒక సర్వేను చేయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఆ సర్వే ప్రకారం కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే తెలుగుదేశం కథ కంచికే అని తేలిందని తెలుస్తోంది. కాంగ్రెస్ తో కలిసి పోటీ చేస్తే ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారనే అనే అంశంపై బాబు ఈ సర్వే చేయించుకున్నట్టుగా తెలుస్తోంది.

ఒక్కోసారి ఒక్కో పార్టీతో చంద్రబాబు నాయుడు చట్టాపట్టాలేసుకుని రావడాన్ని జనాలు సహించరని ఈ సర్వేలు స్పష్టం చేశాయట. బాబును పచ్చి అవకాశవాదిగా చూస్తున్నారు జనాలని స్పష్టం అయ్యిందట. ఫలితంగా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ తో ఏపీలో పొత్తుకు భయపడుతున్నాడని సమాచారం. ఆ వ్యూహం పారదనే భావనతో బాబు వెనక్కు తగ్గేలా ఉన్నాడని సమాచారం అందుతోందిప్పుడు.

First Published:  18 Oct 2018 5:31 AM GMT
Next Story