Telugu Global
Cinema & Entertainment

తమన్న కూడా రంగంలోకి దూకేసింది

ఇది దసరా సీజన్. సినిమా రిలీజ్ లు మాత్రమే కాదు, ఫస్ట్ లుక్స్, ప్రారంభోత్సవాల్లాంటి కార్యక్రమాలు కూడా చురుగ్గా సాగుతుంటాయి. ఇందులో భాగంగా ఇప్పటికే కొన్ని సినిమాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఇప్పుడీ లిస్ట్ లోకి తమన్న కూడా చేరింది. తను నటించిన కొత్త సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేయబోతోంది. హిందీలో సూపర్ హిట్ అయిన క్వీన్ సినిమాను తెలుగులో రీమేక్ చేసింది తమన్న. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా దాదాపు షూటింగ్ […]

తమన్న కూడా రంగంలోకి దూకేసింది
X

ఇది దసరా సీజన్. సినిమా రిలీజ్ లు మాత్రమే కాదు, ఫస్ట్ లుక్స్, ప్రారంభోత్సవాల్లాంటి కార్యక్రమాలు కూడా చురుగ్గా సాగుతుంటాయి. ఇందులో భాగంగా ఇప్పటికే కొన్ని సినిమాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఇప్పుడీ లిస్ట్ లోకి తమన్న కూడా చేరింది. తను నటించిన కొత్త సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేయబోతోంది.

హిందీలో సూపర్ హిట్ అయిన క్వీన్ సినిమాను తెలుగులో రీమేక్ చేసింది తమన్న. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా దాదాపు షూటింగ్ పూర్తిచేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఈ సినిమాకు దటీజ్ మహాలక్ష్మి అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇప్పుడు అదే టైటిల్ తో ఫస్ట్ లుక్ ను రేపు సాయంత్రం 4 గంటలకు విడుదల చేయబోతున్నారు.

నిజానికి ఈ సినిమాకు అసలు దర్శకుడు నీలకంఠ. ఈ సినిమాకు తెలుగులో కూడా క్వీన్ అనే పేరునే ఫిక్స్ చేశాడు అతడు. కానీ తమన్నతో గొడవ కారణంగా నీలకంఠ తప్పుకోవడంతో ఆ స్థానంలోకి ప్రశాంత్ వర్మ వచ్చాడు. సినిమాలో మిగతా భాగం షూటింగ్ ను పూర్తిచేయడంతో పాటు టైటిల్ కూడా మార్చేశాడు. అదే రేపు ఫస్ట్ లుక్ గా రాబోతోంది.

First Published:  18 Oct 2018 6:11 AM GMT
Next Story