Telugu Global
Cinema & Entertainment

ముగ్గురు ముద్దుగుమ్మలతో విజయ్ రొమాన్స్

రియల్ లైఫ్ లో విజయ్ దేవరకొండకు లవ్ ఎఫైర్ ఉందో లేదో తెలీదు కానీ, తెరపై మాత్రం ఈ హీరో ఏకంగా ముగ్గురు ముద్దుగుమ్మలతో రొమాన్స్ కు రెడీ అవుతున్నాడు. విజయ్ దేవరకొండ ట్రయాంగులర్ లవ్ స్టోరీ ఈరోజు లాంఛనంగా మొదలైంది. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కేఎస్ రామారావు నిర్మాతగా రాబోతున్న ఈ సినిమాకు క్రాంతి మాధవ్ దర్శకుడు. దసరా పర్వదినాన ఈరోజు ప్రారంభమైన ఈ సినిమా ఓపెనింగ్ కు రాఘవేంద్రరావు, అశ్వనీదత్, నాగ్ అశ్విన్, […]

ముగ్గురు ముద్దుగుమ్మలతో విజయ్ రొమాన్స్
X

రియల్ లైఫ్ లో విజయ్ దేవరకొండకు లవ్ ఎఫైర్ ఉందో లేదో తెలీదు కానీ, తెరపై మాత్రం ఈ హీరో ఏకంగా ముగ్గురు ముద్దుగుమ్మలతో రొమాన్స్ కు రెడీ అవుతున్నాడు. విజయ్ దేవరకొండ ట్రయాంగులర్ లవ్ స్టోరీ ఈరోజు లాంఛనంగా మొదలైంది.

క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కేఎస్ రామారావు నిర్మాతగా రాబోతున్న ఈ సినిమాకు క్రాంతి మాధవ్ దర్శకుడు. దసరా పర్వదినాన ఈరోజు ప్రారంభమైన ఈ సినిమా ఓపెనింగ్ కు రాఘవేంద్రరావు, అశ్వనీదత్, నాగ్ అశ్విన్, అల్లు అరవింద్, సుబ్బరామిరెడ్డి లాంటి ప్రముఖులు హాజరయ్యారు. సుబ్బరామిరెడ్డి క్లాప్ కొట్టగా, అల్లు అరవింద్ కెమెరా స్విచాన్ చేశారు. రాఘవేంద్రరావు ముహూర్తపు షాట్ కు దర్శకత్వం వహించారు.

రాశిఖన్నా, ఐశ్వర్యరాజేష్, ఇషా బెల్లాడే ఇందులో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్లుగా నటించబోతున్నారు. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కబోతోంది. అంతేకాదు, ఇందులో ముగ్గురు హీరోయిన్ల వద్ద మూడు డిఫరెంట్ గెటప్స్ లో విజయ్ దేవరకొండ కనిపిస్తాడట. ఈరోజు ఓపెనింగ్ కు మాత్రం ఈ హీరో ఫుల్ గా గడ్డం పెంచి వచ్చాడు. ఇది డియర్ కామ్రేడ్ సినిమాలో లుక్.

First Published:  18 Oct 2018 6:27 AM GMT
Next Story