Telugu Global
NEWS

నారా ఫ్యామిలీ సాయం.... హెరిటేజ్ ఉద్యోగుల ఖాతా నుంచి!

శ్రీకాకుళం జిల్లాను అతలాకుతలం చేసిన తిత్లీ తుఫాన్ విషయంలో నారా ఫ్యామిలీ ఎట్టకేలకు స్పందించింది. ఒకవైపు నారా లోకేష్ మాత్రం తిత్లీ బాధితులకు సాయం అందించాలని పిలుపునిస్తూ ఉన్నాడు. అందరూ స్పందించాలని కోరుతూ ఉన్నాడు. మరి ఎవరెవరికో లోకేష్ బాగానే పిలుపులు ఇస్తున్నాడు కానీ.. ఆయన కుటుంబం మాత్రం స్పందించదా? అనే ప్రశ్న సహజంగానే తలెత్తింది. చంద్రబాబు కుటుంబానికి పెద్ద వ్యాపార సామ్రాజ్యమే ఉంది. బాబు భార్య, ఆయన కోడలు కోట్ల రూపాయల్లో జీతాలు తీసుకుంటున్నారు. ప్రత్యేకించి […]

నారా ఫ్యామిలీ సాయం.... హెరిటేజ్ ఉద్యోగుల ఖాతా నుంచి!
X

శ్రీకాకుళం జిల్లాను అతలాకుతలం చేసిన తిత్లీ తుఫాన్ విషయంలో నారా ఫ్యామిలీ ఎట్టకేలకు స్పందించింది. ఒకవైపు నారా లోకేష్ మాత్రం తిత్లీ బాధితులకు సాయం అందించాలని పిలుపునిస్తూ ఉన్నాడు. అందరూ స్పందించాలని కోరుతూ ఉన్నాడు. మరి ఎవరెవరికో లోకేష్ బాగానే పిలుపులు ఇస్తున్నాడు కానీ.. ఆయన కుటుంబం మాత్రం స్పందించదా? అనే ప్రశ్న సహజంగానే తలెత్తింది.

చంద్రబాబు కుటుంబానికి పెద్ద వ్యాపార సామ్రాజ్యమే ఉంది. బాబు భార్య, ఆయన కోడలు కోట్ల రూపాయల్లో జీతాలు తీసుకుంటున్నారు. ప్రత్యేకించి అధికారం సాధించుకున్నాక వీళ్ల వ్యాపార సామ్రాజ్యం భారీగా విస్తరించింది. ప్రతియేటా కొన్ని వందల కోట్ల రూపాయల లాభాలను ఆర్జిస్తోంది. ఇలాంటప్పుడు చంద్రబాబు నాయుడు కుటుంబం కూడా స్పందించాల్సిన అవసరాన్ని చాలా మంది గుర్తు చేస్తున్నారు.

ఎవరెవరో స్పందించాలని కోరడం కాదు.. నారా ఫ్యామిలీ స్పందించదా? అనే ప్రశ్న తలెత్తుతూ ఉంది. ఇలాంటి నేపథ్యంలో నారా ఫ్యామిలీ ఎట్టకేలకూ స్పందించింది. అరవై ఆరు లక్షల రూపాయలతో నారా కుటుంబం స్పందించింది. ఈ సొమ్మును నారా బ్రహ్మణి తన మామ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అందించింది. అంత వరకూ బాగానే ఉంది కానీ… ఈ సొమ్మును ఎక్కడ నుంచి తీశారు? అనేది ప్రశ్న.

ఈ సొమ్మును తమ సంస్థ తరఫు నుంచి, తమ సంస్థ ఉద్యోగుల తరఫు నుంచి ఇస్తున్నామని నారా బ్రహ్మణి ప్రకటించింది. అదీ కథ. ఇక్కడ స్పష్టం అవుతున్న విషయం ఏమిటంటే.. ఈ సొమ్మును హెరిటేజ్ సంస్థ ఉద్యోగుల జీతాల నుంచి కోసి ఇస్తున్నారు. ఉద్యోగుల జీతాల్లో కోతలు వేసి ఆ సొమ్మును హెరిటేజ్ పేరుతో అందిస్తున్నారు. అంటే ఇక్కడ కూడా నారా ఫ్యామిలీ సొంతంగా ఇస్తున్నది ఏమీ లేదు.

ఉద్యోగుల జీతాల నుంచి కోసి.. తమ పేరుతో పబ్లిసిటీ పొందుతోంది. దటీజ్ నారా ఫ్యామిలీ. శ్రీకాకుళం జిల్లాకు వచ్చిన కష్టాన్ని చూసి ఇలా స్పందించింది!

First Published:  19 Oct 2018 12:43 AM GMT
Next Story