Telugu Global
CRIME

చాట్‌వాలా దగ్గర రూ.1.20 కోట్లు....

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మాత్రమే కాదు… దేశంలో పలుచోట్ల ఐటీ సోదాలు జరుగుతున్నాయి. అందరికీ తెలిసిన కోటీశ్వరులే కాదు ఎవరికీ తెలియని కొంతమంది పేదల దగ్గర కూడా కోట్లు బయటపడుతున్నాయి. లూధియానాలో ఓ పకోడీబండి యజమాని వద్ద రూ.60 లక్షల నగదు దొరికింది. ఇక పాటియాలలో ఓ చాట్‌వాలా దగ్గర రూ.1.20 కోట్లు బయటపడ్డాయి. గత రెండేళ్లుగా ఈ చాట్‌వాలా ఐటీ రిటర్న్స్‌ ఫైల్‌ చేయడం లేదని తేలింది. రియల్‌ ఎస్టేట్‌లో లక్షలాది రూపాయలు పెట్టుబడి పెడుతుండడంతో అనుమానం […]

చాట్‌వాలా దగ్గర రూ.1.20 కోట్లు....
X

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మాత్రమే కాదు… దేశంలో పలుచోట్ల ఐటీ సోదాలు జరుగుతున్నాయి. అందరికీ తెలిసిన కోటీశ్వరులే కాదు ఎవరికీ తెలియని కొంతమంది పేదల దగ్గర కూడా కోట్లు బయటపడుతున్నాయి. లూధియానాలో ఓ పకోడీబండి యజమాని వద్ద రూ.60 లక్షల నగదు దొరికింది.

ఇక పాటియాలలో ఓ చాట్‌వాలా దగ్గర రూ.1.20 కోట్లు బయటపడ్డాయి. గత రెండేళ్లుగా ఈ చాట్‌వాలా ఐటీ రిటర్న్స్‌ ఫైల్‌ చేయడం లేదని తేలింది. రియల్‌ ఎస్టేట్‌లో లక్షలాది రూపాయలు పెట్టుబడి పెడుతుండడంతో అనుమానం వచ్చి ఈ సోదాలు చేపట్టినట్లు ఐటీ అధికారులు చెప్పారు. ఈ చాట్‌వాలాకు సిర్హింద్‌ రోడ్‌లో పెద్ద షాపు ఉందని, పెళ్లిళ్లకు, ఇతర ఫంక్షన్లకు పెద్ద ఎత్తున ఆర్డర్లను బుక్‌ చేస్తున్నాడని తెలిపారు.

పాటియాలాలో చాలామంది ఫుడ్‌ బిజినెస్‌ చేస్తున్నారని, భారీగా ఆదాయం వస్తున్నదని తమ పరిశీలనలో తేలినట్లు అధికారులు వివరించారు. అయితే ఎంత ఆదాయం వచ్చినా వారు ఆదాయపు పన్ను కట్టడం లేదని పేర్కొన్నారు. అందుకే టాక్స్‌ ఎగ్గొడుతున్నవారిపై దాడులు చేస్తున్నట్లు అధికారులు వివరించారు.

First Published:  18 Oct 2018 10:00 PM GMT
Next Story