Telugu Global
NEWS

అత్యాచార బాధితురాలికి అడ్మిషన్‌ నిరాకరించిన స్కూలు!

సామూహిక అత్యాచారానికి గురైన ఓ బాలికకు డెహ్రాడూన్‌లోని ప్రైవేటు స్కూలు అడ్మిషన్‌ నిరాకరించడం సంచలనంగా మారింది. గతనెలలో ఓ బోర్డింగ్‌ స్కూలులో 16 ఏళ్ల బాలిక అత్యాచారానికి గురైంది. ఆమెను ఓ ప్రైవేటు స్కూలులో చేర్చించడానికి తల్లిదండ్రులు ప్రయత్నించగా వారు చేర్చుకోవడానికి నిరాకరించారని ఆమె తరపు న్యాయవాది అరుణా నేగి చౌహాన్‌ వివరించారు. ఆ స్కూలుకు సీబీఎస్‌ఈ అఫిలియేషన్‌ రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆ స్కూలుపై కఠిన చర్యలు తీసుకోవలసిందిగా ముఖ్యమంత్రి త్రివేంద్ర […]

అత్యాచార బాధితురాలికి అడ్మిషన్‌ నిరాకరించిన స్కూలు!
X

సామూహిక అత్యాచారానికి గురైన ఓ బాలికకు డెహ్రాడూన్‌లోని ప్రైవేటు స్కూలు అడ్మిషన్‌ నిరాకరించడం సంచలనంగా మారింది. గతనెలలో ఓ బోర్డింగ్‌ స్కూలులో 16 ఏళ్ల బాలిక అత్యాచారానికి గురైంది. ఆమెను ఓ ప్రైవేటు స్కూలులో చేర్చించడానికి తల్లిదండ్రులు ప్రయత్నించగా వారు చేర్చుకోవడానికి నిరాకరించారని ఆమె తరపు న్యాయవాది అరుణా నేగి చౌహాన్‌ వివరించారు.

ఆ స్కూలుకు సీబీఎస్‌ఈ అఫిలియేషన్‌ రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆ స్కూలుపై కఠిన చర్యలు తీసుకోవలసిందిగా ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్‌ రావత్‌కు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అరవింద్‌ పాండేలకు బాలిక తల్లిదండ్రుల తరఫున లేఖలు రాసినట్లు చౌహాన్‌ తెలిపారు. నగరంలోని మరికొన్ని ప్రైవేటు స్కూళ్లలో కూడా అడ్మిషన్‌ కోసం ప్రయత్నించారని, అందరూ ఏవో సాకులు చెప్పి తిరస్కరించారని ఆయన వివరించారు. ఈ స్కూలు యాజమాన్యం మాత్రం అత్యాచార బాధితురాలికి అడ్మిషన్‌ ఇవ్వలేమని కరాఖండిగా చెప్పిందని, అందుకే ఈ స్కూలుపై చర్యలు తీసుకోవలసిందిగా డిమాండ్‌ చేస్తున్నామని లాయర్‌ చెప్పారు.

బోర్డింగ్‌ స్కూలులో చదువుతున్న సదరు విద్యార్థినిపై నలుగురు సహ విద్యార్థులు ఆగస్టు 14న సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. గర్భం వస్తుందన్న భయంతో ఆ విద్యార్థిని తన సోదరికి ఈ అత్యాచార ఘటన గురించి చెప్పింది. దాంతో సెప్టెంబర్‌లో ఈ విషయం పోలీసులకు చేరింది. అత్యాచారానికి పాల్పడిన నలుగురు విద్యార్థులతో పాటు సాక్ష్యాలు లేకుండా చేయడానికి ప్రయత్నించిన నేరానికి స్కూలు డైరెక్టర్, ప్రిన్సిపాల్, అడ్మినిస్ట్రేషన్‌ ఆఫీసర్, హాస్టల్‌ కేర్‌టేకర్‌గా ఉన్న మహిళను పోలీసులు అరెస్టు చేశారు. బాలికకు వైద్యపరీక్షలు చేసి గర్భవతి కాదని నిర్ధారించారు.

First Published:  19 Oct 2018 12:40 AM GMT
Next Story