Telugu Global
NEWS

60లక్షలతో పట్టుబడ్డ వల్లభనేని డ్రైవర్..  ఎల్‌ రమణ స్థానానికి?

ఇప్పటికే ఒకసారి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించి దొరికిపోయినా… టీడీపీ నేతలు మాత్రం తగ్గడంలేదు. తెలంగాణ రాజకీయాల్లోనూ చక్రం తిప్పిందేకు చంద్రబాబు డైరెక్షన్‌లో పనిచేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌- టీడీపీ కూటమికి చంద్రబాబు రూ. 500 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమయ్యారని వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే టీడీపీ తెలుగు యువత ఉపాధ్యక్షుడు వల్లభనేని అనిల్‌ కారు డ్రైవర్‌ వద్ద 60 లక్షలు దొరికాయి.  హవాలా మార్గంలో వచ్చిన ఈ సొమ్మును జగిత్యాలకు తరలిస్తుండగా […]

60లక్షలతో పట్టుబడ్డ వల్లభనేని డ్రైవర్..  ఎల్‌ రమణ స్థానానికి?
X

ఇప్పటికే ఒకసారి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించి దొరికిపోయినా… టీడీపీ నేతలు మాత్రం తగ్గడంలేదు. తెలంగాణ రాజకీయాల్లోనూ చక్రం తిప్పిందేకు చంద్రబాబు డైరెక్షన్‌లో పనిచేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌- టీడీపీ కూటమికి చంద్రబాబు రూ. 500 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమయ్యారని వార్తలొస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే టీడీపీ తెలుగు యువత ఉపాధ్యక్షుడు వల్లభనేని అనిల్‌ కారు డ్రైవర్‌ వద్ద 60 లక్షలు దొరికాయి. హవాలా మార్గంలో వచ్చిన ఈ సొమ్మును జగిత్యాలకు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. 60 లక్షలను, వల్లభనేని పేరు మీద ఉన్న కారును స్వాధీనం చేసుకున్నారు.

డ్రైవర్‌ను విచారించగా వల్లభనేని అనిల్ ఆదేశం మేరకే తాను డబ్బును తరలిస్తున్నట్టు అంగీకరించారు. డబ్బును కరీంనగర్‌ జిల్లా జగిత్యాలకు తరలిస్తుండడం చర్చనీయాంశమైంది. జగిత్యాల తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ సొంత నియోజవర్గం.

ఈసారి ఎన్నికల్లోనూ అక్కడి నుంచే పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. కాబట్టి టీడీపీ అధిష్టానం చేపట్టిన ఎన్నికల డబ్బు పంపిణీలో భాగంగా జగిత్యాలలో పార్టీ కోసం ఈ 60లక్షలు తరలిస్తుండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పట్టుబడ్డ 60 లక్షలు హవాలా సొమ్ము అని పోలీసులు ఒక అంచనాకు వచ్చారు.

First Published:  18 Oct 2018 8:13 PM GMT
Next Story