Telugu Global
Cinema & Entertainment

సమంతా అలా ఎందుకు చెప్పింది ?

ఈమధ్య మాములు సినిమాల కంటే  రీమేక్ సినిమాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పైగా వేరే భాషల్లో కంటే తమిళంలో హిట్ అయిన ప్రతి సినిమా తెలుగు లో డబ్బింగ్ లేక రీమేక్ చేసి విడుదల చేస్తూనే ఉంటారు. తమిళ తంబీలకి కూడా మన తెలుగు రుచి బాగానే నచ్చుతుంది అనుకోండి. ఈ నేపథ్యంలో తమిళంలో ఈ నెల మొదట్లో విడుదలైన ’96’ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ ని దిల్ రాజు విడుదల కు ముందే కొనుగోలు చేశాడు. […]

సమంతా అలా ఎందుకు చెప్పింది ?
X

ఈమధ్య మాములు సినిమాల కంటే రీమేక్ సినిమాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పైగా వేరే భాషల్లో కంటే తమిళంలో హిట్ అయిన ప్రతి సినిమా తెలుగు లో డబ్బింగ్ లేక రీమేక్ చేసి విడుదల చేస్తూనే ఉంటారు. తమిళ తంబీలకి కూడా మన తెలుగు రుచి బాగానే నచ్చుతుంది అనుకోండి. ఈ నేపథ్యంలో తమిళంలో ఈ నెల మొదట్లో విడుదలైన ’96’ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ ని దిల్ రాజు విడుదల కు ముందే కొనుగోలు చేశాడు. ఆ సినిమా తమిళంలో విడుదలై చాలా పెద్ద హిట్ అయ్యింది. ఇక విజయ్ సేతుపతి, త్రిష నటించిన ఈ సినిమా తెలుగు రీమేక్ కు రంగం సిద్ధం చేస్తున్నాడు దిల్ రాజు.

తెలుగు లో హీరోగా ఇప్పటికే నాని ని అనుకున్నారు. ఇంకా నాని ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది. ఇదిలా ఉండగా, ఈ సినిమాలో హీరోయిన్ గా సమంత ని అడిగితే సమంత… ఈ సినిమాను రీమేక్ చేయకపోవడమే మంచిది అని దిల్ రాజు కి సలహా ఇచ్చిందట. నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పేది కానీ ఇలా చెయ్యద్దు అని ఎందుకు చెప్పిందో అని అందరిలోనూ ఆలోచన మొదలైంది. ఈ సినిమాను డైరెక్ట్ చేస్తే హరీష్ శంకర్ చేయాలి అని దిల్ రాజు ఇప్పటికే చెప్పాడు. ఈ సినిమా ఫ్లాప్ అయితే సమంత నెగ్గినట్టు లేదా హిట్ అయితే హరీష్ శంకర్ గొప్పతనం. చూద్దాం వీరిద్దరిలో గెలుపెవరిదో.

First Published:  18 Oct 2018 11:12 PM GMT
Next Story