Telugu Global
NEWS

సీఎం రమేష్‌పై అనర్హత వేటా?

ఇటీవల ఏబీఎన్ చానల్‌లో   ”నీయమ్మ.. బలిసిందా… ఆంబోతులా తిరుగుతున్నావ్‌. నీ ఒక్కడివే నీతిమంతుడివా. బయట తిరగలేవ్‌” అంటూ టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు రగిలిపోతున్నారు. మరోసారి ప్రెస్‌మీట్ పెట్టిన జీవీఎల్‌ … సీఎం రమేష్‌పై విరుచుకుపడ్డారు. ఐటీ దాడులు జరిగిన సమయంలో సత్యహరిశ్చంద్రుడిలా మీసాలు తిప్పి డైలాగులు చెప్పిన సీఎం రమేష్… ఐటీ దాడుల్లో వంద కోట్ల అక్రమాలు జరిగినట్టు తేలడంపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వంద […]

సీఎం రమేష్‌పై అనర్హత వేటా?
X

ఇటీవల ఏబీఎన్ చానల్‌లో ”నీయమ్మ.. బలిసిందా… ఆంబోతులా తిరుగుతున్నావ్‌. నీ ఒక్కడివే నీతిమంతుడివా. బయట తిరగలేవ్‌” అంటూ టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు రగిలిపోతున్నారు. మరోసారి ప్రెస్‌మీట్ పెట్టిన జీవీఎల్‌ … సీఎం రమేష్‌పై విరుచుకుపడ్డారు. ఐటీ దాడులు జరిగిన సమయంలో సత్యహరిశ్చంద్రుడిలా మీసాలు తిప్పి డైలాగులు చెప్పిన సీఎం రమేష్… ఐటీ దాడుల్లో వంద కోట్ల అక్రమాలు జరిగినట్టు తేలడంపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

వంద కోట్ల రూపాయలు ఎలా దారి మళ్లింది ఐటీ ఇచ్చిన డాక్యుమెంట్లతో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనాన్ని ప్రచురించిందని… దానిపై ఆ పత్రిక ప్రశ్నిస్తే వెళ్లి ఐటీ వారినే అడుక్కోండి అని సీఎం రమేష్ అనడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఒక్క తప్పు కూడా చేయలేదని కోతలు కోసిన రమేష్… ఇప్పుడు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు మాత్రం సమాధానం ఎందుకు చెప్పలేదని నిలదీశారు. ఇలాంటి దోపిడిదారులు పబ్లిక్ అకౌంట్ కమిటీ సభ్యుడిగా ఉండేందుకు అర్హత లేదన్నారు.
అకౌంట్ కమిటీ సభ్యుడిగా రికార్డులను తారుమారు చేసే అవకాశం ఉందన్నారు.

సీఎం రమేష్ కు, టీడీపీ నేతలకు ఐటీ దాడులపై ముందస్తు సమాచారం ఉందన్నారు. అందుకే వేల కోట్ల అక్రమాలు చేసినా సర్దేసుకున్నారన్నారు. కానీ వంద కోట్ల లావాదేవీల వద్ద మాత్రం దొరికిపోయారన్నారు.
ఒక రాజ్యసభ సభ్యుడు అన్న విషయం కూడా మరిచిపోయి ఒక సారా కాంట్రాక్టర్ తరహాలో సీఎం రమేష్ మాట్లాడుతున్నారన్నారు. ఈ వ్యక్తికి ఎంపీగా ఉండే అర్హతలు లేవని… కాబట్టి పార్లమెంట్ ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు చేస్తానన్నారు జీవీఎల్. గతంలో డబ్బులు తీసుకుని ప్రశ్నలు అడిగిన ఎంపీల సభ్యత్వాలను ఎథిక్స్ కమిటీనే రద్దు చేసిందని.. ఇప్పుడు ఎల్‌కే అడ్వానీ నాయకత్వంలోని ఎథిక్స్ కమిటీని కలిసి సీఎం రమేష్‌ను సభ నుంచి గెంటేయాల్సిందిగా కోరుతామన్నారు.

సీఎం రమేష్ లాంటి వ్యక్తిని రాజ్యసభకు పంపినందుకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలన్నారు. సీఎం రమేష్ చంద్రబాబుకు బినామీ అని ఆరోపించారు. సీఎం రమేష్‌కు పదేపదే చంద్రబాబు రాజ్యసభ సీటు ఇవ్వడం వెనుక బినామీ, ఆర్థిక వ్యవహారలే కారణమన్నారు జీవీఎల్.

First Published:  19 Oct 2018 2:43 AM GMT
Next Story