Telugu Global
National

గౌహతీలో సూపర్ సండే వన్డే ఫైట్

హోరాహోరీనా…మరో ఏకపక్షమా? టీమిండియా తో విండీస్ తొలిసమరం రిషభ్ పంత్ వన్డే అరంగేట్రానికి కౌంట్ డౌన్ విరాట్ కొహ్లీని ఊరిస్తున్న 10వేల రికార్డు టీమిండియా- వెస్టిండీస్ జట్ల పాంచ్ పటాకా వన్డే సిరీస్ లోని తొలిసమరానికి…. గౌహతీలోని బారస్పారా స్టేడియంలో రంగం సిద్ధమయ్యింది. ఈ సూపర్ సండే ఫైట్ లో… ప్రపంచ రెండో ర్యాంకర్ టీమిండియా హాట్ ఫేవరెట్ గా పోటీకి దిగుతోంది. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే ఈమ్యాచ్ ద్వారా… టీమిండియా యువ వికెట్ […]

గౌహతీలో సూపర్ సండే వన్డే ఫైట్
X
  • హోరాహోరీనా…మరో ఏకపక్షమా?
  • టీమిండియా తో విండీస్ తొలిసమరం
  • రిషభ్ పంత్ వన్డే అరంగేట్రానికి కౌంట్ డౌన్
  • విరాట్ కొహ్లీని ఊరిస్తున్న 10వేల రికార్డు

టీమిండియా- వెస్టిండీస్ జట్ల పాంచ్ పటాకా వన్డే సిరీస్ లోని తొలిసమరానికి…. గౌహతీలోని బారస్పారా స్టేడియంలో రంగం సిద్ధమయ్యింది. ఈ సూపర్ సండే ఫైట్ లో… ప్రపంచ రెండో ర్యాంకర్ టీమిండియా హాట్ ఫేవరెట్ గా పోటీకి దిగుతోంది. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే ఈమ్యాచ్ ద్వారా… టీమిండియా యువ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్ అరంగేట్రం చేయనున్నాడు.

రిషభ్ పంత్ కు వన్డే క్యాప్….
వన్డే క్రికెట్లో మరో ఏకపక్ష సిరీస్ కు… భారత్ వేదికగా రంగం సిద్ధమయ్యింది. గౌహతీ బారస్పారా స్టేడియం వేదికగా జరిగే సూపర్ సండే ఫైట్ ద్వారా ప్రారంభమయ్యే ఈ పాంచ్ పటాకా సిరీస్ లో…. వన్డే క్రికెట్ రెండో ర్యాంకర్ టీమిండియాకు… 7వ ర్యాంకర్ వెస్టిండీస్ సవాల్ విసురుతోంది. ఈ రెండుజట్ల సభ్యులూ ఇప్పటికే గౌహతీ స్టేడియంలో సన్నాహాలను ముగించారు.

పవర్ ఫుల్ బ్యాటింగ్ లైనప్…
విరాట్ కొహ్లీ నాయకత్వంలోని టీమిండియా ఈ పోటీలో హాట్ ఫేవరెట్ గా పోటీకి సిద్ధమయ్యింది. శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, అంబటి రాయుడు, రిషభ్ పంత్, మహేంద్రసింగ్ ధోనీ, రవీంద్ర జడేజాలతో కూడిన భీకర బ్యాటింగ్ లైనప్ తో… కరీబియన్ బౌలర్ల పని పట్టడానికి తహతహలాడుతోంది.

యువ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్…
ఈ మ్యాచ్ ద్వారానే … స్పెషలిస్ట్ బ్యాట్స్ మన్ గా వన్డే అరంగేట్రం చేయటానికి ఉరకలేస్తున్నాడు.

యువఆటగాళ్లతో విండీస్….
మరోవైపు… జెయింట్ ఆల్ రౌండర్ జేసన్ హోల్డర్ నాయకత్వంలోని విండీస్ జట్టులో మాత్రం మర్లోన్ శామ్యూల్స్, కీరాన్ పావెల్, దేవేంద్ర బిషు లాంటి అనుభవం ఉన్న ఆటగాళ్లు అతికొద్ది మంది మాత్రమే ఉన్నారు. వచ్చే ఏడాది జరిగే ప్రపంచకప్ కు ముందు… తమ ఆటగాళ్ల సత్తాను బేరీజు వేసుకోడానికి ఈ సిరీస్ తమకు ఎంతగానో ఉపయోగపడే అవకాశం ఉందని… కరీబియన్ టీమ్ మేనేజ్ మెంట్ భావిస్తోంది.

కొహ్లీని ఊరిస్తున్న రికార్డులు…
ఇక… రికార్డుల మొనగాడు, టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీని సైతం… సచిన్ టెండుల్కర్ పేరుతో ఉన్న ఓ రికార్డుతో పాటు… 10వేల పరుగుల రికార్డు సైతం ఊరిస్తోంది. ఐదు మ్యాచ్ ల ఈ సిరీస్ లో విరాట్ కొహ్లీ మరో 221 పరుగులు సాధించగలిగితే… 10వేల పరుగుల మైలురాయిని చేరటమే కాదు… అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన భారత క్రికెటర్ గా నిలిచిపోతాడు.

మాస్టర్ సచిన్ మొత్తం 259 ఇన్నింగ్స్ లో 10 వేల పరుగులు సాధిస్తే… కొహ్లీ మాత్రం సచిన్ కంటే 76 ఇన్నింగ్స్ తక్కువగా ఆడి… ఇప్పటికే 9వేల 779 పరుగులు సాధించాడు. టెస్ట్ సిరీస్ లో కనబరిచిన దూకుడునే కొహ్లీ… వన్డే సిరీస్ లో సైతం కొనసాగించగలిగితే… అత్యంత వేగంగా 10వేల పరుగుల రికార్డు చేరడం ఏమంత కష్టంకాబోదు. అయితే… టెస్ట్ సిరీస్ లో టీమిండియాకు ఏమాత్రం పోటీఇవ్వలేని కరీబియన్ టీమ్… కనీసం వన్డే సిరీస్ లోనైనా గట్టి పోటీ ఇవ్వగలదా?… అనుమానమే.

First Published:  20 Oct 2018 8:20 AM GMT
Next Story