Telugu Global
Cinema & Entertainment

  'అరవింద'కు సంబంధించి ఆఖరి ఈవెంట్

అరవింద సమేత సినిమా ప్రచారాన్ని దగ్గరుండి చూసుకున్నాడు ఎన్టీఆర్. సినిమాకు సంబంధించి ఎంత చేయాలో అంతా చేశాడు. రోజుకో ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నాడు. సినిమా థియేటర్లలోకి వచ్చి, సక్సెస్ ఫుల్ గా రెండో వారంలోకి అడుగుపెట్టిన ఈ తరుణంలో ఇక ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించుకున్నాడు తారక్. ఇందులో భాగంగా అరవింద సమేత సినిమా ప్రచారానికి సంబంధించి ఎన్టీఆర్ పాల్గొనబోయే ఆఖరి ఈవెంట్ కు రంగం సిద్ధమౌతోంది. హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో రేపు అరవింద సమేత […]

  అరవిందకు సంబంధించి ఆఖరి ఈవెంట్
X

అరవింద సమేత సినిమా ప్రచారాన్ని దగ్గరుండి చూసుకున్నాడు ఎన్టీఆర్. సినిమాకు సంబంధించి ఎంత చేయాలో అంతా చేశాడు. రోజుకో ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నాడు. సినిమా థియేటర్లలోకి వచ్చి, సక్సెస్ ఫుల్ గా రెండో వారంలోకి అడుగుపెట్టిన ఈ తరుణంలో ఇక ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించుకున్నాడు తారక్. ఇందులో భాగంగా అరవింద సమేత సినిమా ప్రచారానికి సంబంధించి ఎన్టీఆర్ పాల్గొనబోయే ఆఖరి ఈవెంట్ కు రంగం సిద్ధమౌతోంది.

హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో రేపు అరవింద సమేత సక్సెస్ మీట్ ను పెద్ద ఎత్తున నిర్వహించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ వస్తున్నాడు. సినిమాకు సంబంధించి ఎన్టీఆర్ పాల్గొనే ఆఖరి ఈవెంట్ ఇదే. దీని తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలకు వెళ్లబోతున్నాడు తారక్. అక్కడ కొన్నాళ్ల పాటు సేదతీరి, తర్వాత రాజమౌళి దర్శకత్వంలో చేయబోతున్న సినిమాకు సంబంధించి వర్క్ షాప్ ప్రారంభిస్తాడు.

ప్రస్తుతానికైతే దసరా ఎఫెక్ట్ కారణంగా అరవింద సమేత సినిమా థియేటర్లలో నడుస్తోంది. ఈ సినిమాకు వస్తున్న వసూళ్లను కావాలనే పెంచి చెబుతున్నారంటూ ఓ వైపు సోషల్ మీడియాలో పోస్టులు పడుతున్నాయి. మరోవైపు చాలా ఏరియాల్లో సినిమా బ్రేక్-ఈవెన్ కు దగ్గరగా కూడా లేదు. అయినప్పటికీ ఎన్టీఆర్ బిజీ షెడ్యూల్స్ ను దృష్టిలో పెట్టుకొని అరవింద సమేత సక్సెస్ మీట్ కు ఏర్పాట్లు చేస్తున్నారు.

First Published:  20 Oct 2018 4:24 AM GMT
Next Story