Telugu Global
Cinema & Entertainment

సినిమా ఫ్లాప్.. ఆనందంలో రామ్

ఈ హీరోలంతే. ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో వాళ్లకే తెలీదు. ఓ వైపు సినిమాకు రోజురోజుకు వసూళ్లు తగ్గిపోతుంటే, మరోవైపు రామ్ గాల్లో తేలిపోతున్నాడు. ఆనందంతో పండగ చేసుకుంటున్నారు. అతడు నటించిన హలో గురు ప్రేమకోసమే సినిమాకు సంబంధించిన మేటర్ ఇది. దసరా కానుకగా మొన్న విడుదలైన ఈ సినిమాకు నెగెటివ్ రివ్యూలు పడ్డాయి. నేను శైలజ, నేను లోకల్ సినిమాల్ని కలిపి హలో గురు ప్రేమకోసమే అనే మరో సినిమా తీశారంటూ కామెంట్లు పడుతున్నాయి. మరోవైపు […]

సినిమా ఫ్లాప్.. ఆనందంలో రామ్
X

ఈ హీరోలంతే. ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో వాళ్లకే తెలీదు. ఓ వైపు సినిమాకు రోజురోజుకు వసూళ్లు తగ్గిపోతుంటే, మరోవైపు రామ్ గాల్లో తేలిపోతున్నాడు. ఆనందంతో పండగ చేసుకుంటున్నారు. అతడు నటించిన హలో గురు ప్రేమకోసమే సినిమాకు సంబంధించిన మేటర్ ఇది.

దసరా కానుకగా మొన్న విడుదలైన ఈ సినిమాకు నెగెటివ్ రివ్యూలు పడ్డాయి. నేను శైలజ, నేను లోకల్ సినిమాల్ని కలిపి హలో గురు ప్రేమకోసమే అనే మరో సినిమా తీశారంటూ కామెంట్లు పడుతున్నాయి. మరోవైపు సినిమాలో కామెడీ కూడా పెద్దగా క్లిక్ అవ్వలేదంటున్నారు చాలామంది. ఇలాంటి టైమ్ లో సోమవారం నుంచి ఈ సినిమా పరిస్థితేంటనేది ఎవరైనా ఈజీగా ఊహించుకోవచ్చు.

కానీ రామ్ మాత్రం ఈ విషయాలేవీ పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం అతడు ఆనందంలో ఉన్నాడు. ఎందుకంటే, ఈ సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్నాడు రామ్. అతడి ఆనందానికి కారణం ఇది. సినిమాకు రోజురోజుకు కలెక్షన్లు పడిపోతున్నాయనే విషయాన్ని వదిలేసి, ప్రచారాన్ని పక్కనపెట్టి, కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ వచ్చినందుకు సంబరపడిపోతున్నాడు ఈ హీరో.

First Published:  20 Oct 2018 4:35 AM GMT
Next Story