మళ్లీ కసరత్తులు ప్రారంభించిన కమల్

సినిమాలో పాత్ర కోసం కమల్ ఎంత కష్టపడతాడో అందరికీ తెలిసిందే. దశావతారం సినిమాలో 10 పాత్రలు 10 గెటప్పుల కోసం కమల్ పడిన కష్టాన్ని అంత ఈజీగా మరిచిపోలేం. కేవలం దశావతారం మాత్రమే కాదు, కమల్ నటించిన ఎన్నో సినిమాల్లో అతడి కష్టం కళ్లకు కనిపిస్తుంది. ఇప్పుడు తన అప్ కమింగ్ మూవీ కోసం కూడా కమల్ అదే విధంగా కష్టపడబోతున్నాడు.

ఇండియన్-2 సినిమా కోసం కమల్ అమాంతం బరువు తగ్గాలని నిర్ణయించుకున్నాడు. దీని కోసం ఓ విదేశీ ఫిట్ నెస్ ట్రయినర్ ను కూడా నియమించుకున్నాడు. అతడి ఆధ్వర్యంలో ఆల్రెడీ ఎక్సర్ సైజులు స్టార్ట్ చేశాడు.

గతంలో కమల్ మోకాలికి గాయమైంది. ఆ టైమ్ లో కమల్ కాస్త ఒళ్లు చేశాడు. ఇప్పుడు ఇండియన్-2 కోసం అదంతా కరిగించాలి. పైగా డిసెంబర్ నుంచే ఈ సినిమా సెట్స్ పైకి రాబోతోంది. అంటే కమల్ ముందు కేవలం 40 రోజుల టైమ్ మాత్రమే ఉంది. ఈ తక్కువ సమయంలో ఎక్కువ కెలొరీలు కరిగించి, స్లిమ్ అవ్వాలనుకుంటున్నాడు కమల్.

శంకర్ దర్శకత్వంలో రాబోతోంది ఇండియన్-2. 2019 మొత్తం ఈ సినిమాను షూట్ చేస్తారు. 2020 సమ్మర్ కు విడుదల చేయాలనేది ప్లాన్. అనిరుధ్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.