Telugu Global
NEWS

కోదండ దెబ్బకు.. టీడీపీ, కాంగ్రెస్‌లలో భయం!

తెలంగాణలో మహాకూటమి ఏర్పాటు ఇంకా ఒక కొలిక్కి రావడం లేదు. దీనికి సంబంధించి చర్చలు చాలా కాలం నుంచే జరుగుతున్నా ఇవి ఎంతకూ తేలడం లేదు. సీట్ల విషయంలోనే పితలాటకం అంతా కొనసాగుతూ ఉందని తెలుస్తోంది. కూటమి ఏర్పాటుకు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఉత్సాహంగా ఉన్నాయి. వీళ్లు మాత్రమే కలిసి ఎన్నికలకు వెళ్లాలని అనుకోవడం లేదు. తమకు తోడుగా కమ్యూనిస్టులు, కోదండరాం కూడా తోడు అయితే బాగుంటుందని అనుకున్నారు. ఈ మేరకు వాళ్లను కూడా చర్చలకు పిలిచారు. […]

కోదండ దెబ్బకు.. టీడీపీ, కాంగ్రెస్‌లలో భయం!
X

తెలంగాణలో మహాకూటమి ఏర్పాటు ఇంకా ఒక కొలిక్కి రావడం లేదు. దీనికి సంబంధించి చర్చలు చాలా కాలం నుంచే జరుగుతున్నా ఇవి ఎంతకూ తేలడం లేదు. సీట్ల విషయంలోనే పితలాటకం అంతా కొనసాగుతూ ఉందని తెలుస్తోంది.

కూటమి ఏర్పాటుకు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఉత్సాహంగా ఉన్నాయి. వీళ్లు మాత్రమే కలిసి ఎన్నికలకు వెళ్లాలని అనుకోవడం లేదు. తమకు తోడుగా కమ్యూనిస్టులు, కోదండరాం కూడా తోడు అయితే బాగుంటుందని అనుకున్నారు. ఈ మేరకు వాళ్లను కూడా చర్చలకు పిలిచారు.

ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినన్ని సీట్లకు తెలుగుదేశం ఓకే అంటోంది. ఎన్ని సీట్లు ఇచ్చినా తమకు ఓకే అన్నట్టుగా ఉంది పచ్చ పార్టీ. ఇక కమ్యూనిస్టులదీ అదే పరిస్థితి.

అయితే కోదండరాం మాత్రం సీట్ల విషయంలో పట్టుబడుతున్నాడని తెలుస్తోంది. తను కోరినన్ని సీట్లు ఇవ్వాల్సిందే అని ఆయన డిమాండ్ చేస్తున్నాడని సమాచారం. కోదండరాం వల్లనే ఈ మహాకూటమి ఏర్పాటు ఎంతకూ తేలడం లేదని కూడా అంటున్నారు.

తను కోరినన్ని సీట్లు ఇవ్వాలని.. లేని పక్షంలో ఒంటరిగా పోటీకి లేదా బీజేపీతో చేతులు కలపడానికి వెనుకాడేది లేదని కోదండరాం అంటున్నాడని సమాచారం, అయితే కోదండరాం ఒంటరిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలుతాయని, బీజేపీతో చేతులు కలిపితే ఆ పార్టీకి ప్లస్ అవుతుందని కాంగ్రెస్, టీడీపీలు భావిస్తున్నాయి.

అందుకే ఏదోలా కోదండరాంను అట్టి పెట్టుకోవడానికి ఈ పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇదే అదునుగా కోదండరాం తన డిమాండ్ల విషయంలో గట్టిగా ఉన్నాడు. అనుకున్నన్ని సీట్లను సాధించే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఈ మహాకూటమి కథ ఎలా సాగుతుందో చూడాలి!

First Published:  21 Oct 2018 2:37 AM GMT
Next Story