పవన్ పార్టీలోకి ఆయన చేరిక ఆగిందా?

తెలుగుదేశం పార్టీ అధినేత చలమలశెట్టి సునీల్ మీద చాలా ఆశలే పెట్టుకున్నాడు. గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి త్రుటిలో విజయాన్ని కోల్పోయిన సునీల్ ను చేర్చుకోవాలని చంద్రబాబు నాయుడు శతవిధాల‌ ప్రయత్నిస్తూ వచ్చాడు. అతడిని చేర్చుకోవడం ద్వారా వైసీపీని దెబ్బ కొట్టినట్టు అవుతుందని.. అలాగే తన పార్టీకీ ఆర్థికంగా బలవంతుడు అయిన వ్యక్తి కలిసి వచ్చినట్టు అవుతుందని చంద్రబాబు నాయుడు లెక్కలేసుకున్నాడు.

అయితే చలమలశెట్టి సునీల్ తొందరపడడంలేదు. పలుసార్లు చంద్రబాబుతో సమావేశం తర్వాత కూడా టీడీపీలో చేరికను వాయిదా వేసుకొంటూ వచ్చాడు. ఇలాంటి నేపథ్యంలో పవన్ కల్యాణ్ రంగంలోకి దిగాడు. చలమలశెట్టిని తన పార్టీలోకి చేర్చుకునే ప్రయత్నం చేశాడు పవన్ కల్యాణ్.

అయితే ఇటు జనసేనలోకి కూడా సునీల్ అంత తేలికగా చేరే అవకాశాలు లేవని తెలుస్తోంది. బాబు బుట్టలోని సునీల్ కు పవన్ బాగానే వల వేశాడు కానీ.. చేర్చుకోవడం మాత్రం అంత సులభం కావడం లేదట. దీనికి కారణం.. సునీల్ పలు డిమాండ్లను వినిపిస్తూ ఉండటమే. తనకు సీటుతో పాటు.. మరికొన్ని సీట్ల విషయంలో కూడా సునీల్ డిమాండ్లను పవన్ ముందు పెడుతున్నాడట. వాటన్నింటికీ ఓకే అంటేనే చేరుతాను అంటున్నాడట. దీంతో ఈ వ్యవహారం అలా ఆగిపోయిందని తెలుస్తోంది.

తన పార్టీలోకి నేతలను చేర్చుకోవడానికి పవన్ చాలా సిద్ధంగా ఉన్నాడని.. అయితే వాళ్లు ఇలా డిమాండ్లు పెడితే పవన్ కు అహం అడ్డొస్తోందని తెలుస్తోంది. అందుకే సునీల్ చేరిక ప్రస్తుతానికి ఆగిందని అంటున్నారు.