Telugu Global
NEWS

సీట్ల లెక్క.... చంద్రబాబుతో కీలక సమావేశం....

తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్ వచ్చారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఈరోజు ఉదయం 10 గంటలకు తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశమయ్యారు. ఇందులో ప్రధానంగా మహాకూటమిలో సీట్లు సర్ధుబాటు.. ఎవరెవరికి సీట్లు ఇవ్వాలనే దానిపైనే చర్చించినట్టు సమాచారం. ఇందులో భాగంగా తెలంగాణలోని కీలకమైన ఎనిమిది మందికి సీట్లు ఖాయం అనే వార్తలొస్తున్నాయి. టీడీపీ తెలంగాణ సీనియర్లు అయిన దేవేందర్ గౌడ్, నామా నాగేశ్వరరావు, రావుల చంద్రశేఖర్ రెడ్డి, పెద్దిరెడ్డి, కొత్తకోట దయాకర్, […]

సీట్ల లెక్క.... చంద్రబాబుతో కీలక సమావేశం....
X

తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్ వచ్చారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఈరోజు ఉదయం 10 గంటలకు తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశమయ్యారు. ఇందులో ప్రధానంగా మహాకూటమిలో సీట్లు సర్ధుబాటు.. ఎవరెవరికి సీట్లు ఇవ్వాలనే దానిపైనే చర్చించినట్టు సమాచారం. ఇందులో భాగంగా తెలంగాణలోని కీలకమైన ఎనిమిది మందికి సీట్లు ఖాయం అనే వార్తలొస్తున్నాయి.

టీడీపీ తెలంగాణ సీనియర్లు అయిన దేవేందర్ గౌడ్, నామా నాగేశ్వరరావు, రావుల చంద్రశేఖర్ రెడ్డి, పెద్దిరెడ్డి, కొత్తకోట దయాకర్, అరవింద్ గౌడ్, వెంకట వీరయ్య, ఎల్ రమణలకు సీట్లు గ్యారెంటీగా ఇవ్వాలని ఆ సీట్ల ప్రతిపాదనను బాబు ప్రతిపాదించి మహాకూటమికి ఇవ్వనున్నట్టు సమాచారం. టీడీపీ సీనియర్లు కోరుకున్న చోట సీట్ల సర్దుబాటు చేయాలని స్వయంగా బాబు కాంగ్రెస్ ను కోరబోతున్నట్టు సమాచారం.

మొత్తం 15 సీట్లను కాంగ్రెస్ ఇవ్వబోతుండగా.. అందులో సీనియర్లు 8 మందికి పక్కాగా సీట్లు ఖాయమని తెలుస్తోంది. టీడీపీ నేత ఎల్ రమణ జగిత్యాల నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి అక్కడ ఉన్నారు. ఈయనకు కూకట్ పల్లి కానీ హైదరాబాద్ లోని ఏదైనా సెటిలర్స్‌ స్థానం కానీ ఖాయమయ్యే సూచనలున్నాయి.

మరో సీనియర్ నేత పెద్దిరెడ్డి ఈ సారి కూకట్ పల్లి నుంచి పోటీ చేసేందుకు సిద్ధ పడుతున్నారు. కానీ పెద్దిరెడ్డిని హుజూరాబాద్ నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ నేతలు సూచిస్తున్నారట. దానిపై చర్చిస్తున్నట్టు సమాచారం. మరో నేత దేవేందర్ గౌడ్ విషయానికి వస్తే. మహేశ్వరం, రాజేంద్ర నగర్ లలో ఒక సీటు ఖాయం కానుంది. ఆయన కొడుకు వీరేందర్ గౌడ్ కు కూడా సీటు కేటాయించాలని బాబుపై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. ఉప్పల్ నుంచి వీరేందర్ సీటు కోరుతున్నారు. ఇక మిగతా నేతలందరూ వారి వారి పోటీచేసే స్థానాల్లోనే సీట్లు ఖాయంగా కనిపిస్తోంది.

First Published:  22 Oct 2018 12:07 AM GMT
Next Story