Telugu Global
NEWS

కాంగ్రెస్ చెప్పినట్టు చేయండి, తమ్ముళ్లకు బాబు హుకుం!

తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు నాయుడి సమావేశం ఆసక్తిదాయకంగా సాగింది. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడానికి, వారిలో స్ఫూర్తి నింపడానికి చంద్రబాబు నాయుడు ఈ సమావేశాన్నినిర్వహిస్తాడని అంతా అనుకున్నారు. అయితే అందుకు భిన్నంగా పార్టీ శ్రేణులను బెదిరింపులు, హెచ్చరికలతో బెదరగొట్టాడు చంద్రబాబు నాయుడు. ప్రత్యేకించి పొత్తు, సీట్ల విషయంలో తెలుగు తమ్ముళ్లు పలు విన్నపాలు చేయగా చంద్రబాబు నాయుడు వాటిని ఖాతరు చేయలేదు. పొత్తులో భాగంగా చాలా నష్టపోతున్నామని… తమ్ముళ్లు బాబుకు విన్నవించారట. కనీసం ముప్పై సీట్లు […]

కాంగ్రెస్ చెప్పినట్టు చేయండి, తమ్ముళ్లకు బాబు హుకుం!
X

తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు నాయుడి సమావేశం ఆసక్తిదాయకంగా సాగింది. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడానికి, వారిలో స్ఫూర్తి నింపడానికి చంద్రబాబు నాయుడు ఈ సమావేశాన్నినిర్వహిస్తాడని అంతా అనుకున్నారు. అయితే అందుకు భిన్నంగా పార్టీ శ్రేణులను బెదిరింపులు, హెచ్చరికలతో బెదరగొట్టాడు చంద్రబాబు నాయుడు.

ప్రత్యేకించి పొత్తు, సీట్ల విషయంలో తెలుగు తమ్ముళ్లు పలు విన్నపాలు చేయగా చంద్రబాబు నాయుడు వాటిని ఖాతరు చేయలేదు. పొత్తులో భాగంగా చాలా నష్టపోతున్నామని… తమ్ముళ్లు బాబుకు విన్నవించారట. కనీసం ముప్పై సీట్లు అడగాలని.. వీరు బాబుకు చెప్పుకున్నట్టుగా సమాచారం. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం ససేమిరా అన్నాడని టాక్.

ముప్పై సీట్లు నేను అడగను అని.. అలా అడిగితే కాంగ్రెస్ పార్టీతో పొత్తు కుదరదు అని చంద్రబాబు తేల్చి చెప్పాడట.

ఇప్పటికైతే కాంగ్రెస్ పార్టీ 12 సీట్లను ఇస్తానని అంటోందని…. తను ఈ విషయమై మాట్లాడతానని, మరో ఆరు సీట్లు ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరతానని చంద్రబాబు నాయుడు టీడీపీ నేతలతో వ్యాఖ్యానించినట్టుగా సమాచారం.

అంతకు మించి సీట్లను అడిగేది కూడా లేదని… కాంగ్రెస్ ఇచ్చినన్ని సీట్లతో సర్దుకోవాలని బాబు క్లాస్ పీకాడట. చంద్రబాబు నాయుడు మరీ ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ల ముందు సాగిల పడిపోవడాన్ని చూసి టీటీడీపీ నేతలే ఆశ్చర్యపోతున్నారు. మరీ పార్టీని చంద్రబాబు నాయుడు తాకట్టు పెట్టేస్తున్నాడని వారు వాపోతున్నారు.

First Published:  22 Oct 2018 4:55 AM GMT
Next Story