Telugu Global
NEWS

ఎన్నికలు అయ్యేదాక హరీష్‌ రావుదే పెత్తనం

గడిచిన నాలుగున్నరేళ్లుగా కేసీఆర్ తర్వాత ప్రభుత్వంలో నంబర్ 2గా ఎదిగారు కేటీఆర్. కానీ రాజకీయాలు, పార్టీ పరంగా మాత్రం ఎదగలేరని మరోసారి నిరూపితమైంది. కీలకమైన ముందస్తు ఎన్నికల వేళ కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయంతో మరోసారి ట్రబుల్ షూటర్.. ఎన్నికల వ్యూహకర్త హరీష్ రావు ప్రాధాన్యం, పవర్ ఏంటో అందరికీ అర్థమైంది. తాజాగా నిన్న రాత్రి వరకూ జరిగిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల సమావేశంలో కేసీఆర్ క్లాస్ తీసుకున్నారు. ఎన్నికలను ఎదుర్కోవడం ఎలా.? ఎలా గెలివాలి.. అతివిశ్వాసం […]

ఎన్నికలు అయ్యేదాక హరీష్‌ రావుదే పెత్తనం
X

గడిచిన నాలుగున్నరేళ్లుగా కేసీఆర్ తర్వాత ప్రభుత్వంలో నంబర్ 2గా ఎదిగారు కేటీఆర్. కానీ రాజకీయాలు, పార్టీ పరంగా మాత్రం ఎదగలేరని మరోసారి నిరూపితమైంది. కీలకమైన ముందస్తు ఎన్నికల వేళ కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయంతో మరోసారి ట్రబుల్ షూటర్.. ఎన్నికల వ్యూహకర్త హరీష్ రావు ప్రాధాన్యం, పవర్ ఏంటో అందరికీ అర్థమైంది.

తాజాగా నిన్న రాత్రి వరకూ జరిగిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల సమావేశంలో కేసీఆర్ క్లాస్ తీసుకున్నారు. ఎన్నికలను ఎదుర్కోవడం ఎలా.? ఎలా గెలివాలి.. అతివిశ్వాసం వద్దు అనే రీతిలో అభ్యర్థులకు బోధించారు. ఇందులో హరీష్ రావు ఎన్నికల ఎత్తుగడలను ప్రశంసించినట్టు సమాచారం. అంతేకాదు.. కీలకమైన ముందస్తు ఎన్నికల వేళ హరీష్ రావుపై పెద్ద బాధ్యత పెట్టి…. కేటీఆర్ ను హైదరాబాద్ కే పరిమితం చేసేశారు కేసీఆర్.

ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే నవంబర్ 12లోపు కేసీఆర్ తెలంగాణ వ్యాప్తంగా 40 నియోజకవర్గాల్లో సభలు నిర్వహించాలని ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా ఈ నెలాఖరున కరీంనగర్, వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేశారు. నవంబర్ మొదటి వారంలో హైదరాబాద్ గ్రేటర్ పరిధిలో భారీ బహిరంగ సభకు నిర్ణయించారు. కాగా హైదరాబాద్ లో నిర్వహించే సభల బాధ్యతను ప్రచార పర్వాలకు కేటీఆర్ ను బాధ్యుడిగా నియమించగా…. హైదరాబాద్ మినహా తెలంగాణ మొత్తం ప్రచారం, సభల నిర్వహణను హరీష్ రావుకు అప్పగించారు కేసీఆర్.. గడిచిన ఎన్నికల్లో హైదరాబాద్ పరిధిలో కేవలం ఒక్క సీటే టీఆర్ఎస్ గెలవగా.. తెలంగాణ వ్యాప్తంగా మెరుగైన సీట్లు గెలుచుకుంది. దీంతో హరీష్ రావు ఈసారి కూడా రూరల్ లో సీట్ల గెలుపు బాధ్యతను తీసుకున్నారు. పట్నంలో కేటీఆర్ ఎన్ని సీట్లు సంపాదించిపెడతారనేది వేచిచూడాల్సిందే..

ఈ లెక్కన కొడుకు స్టామినాపై కంటే హరీష్ పైనే ఎక్కువ భారం మోపి గెలుపు బాధ్యతల్లో హరీష్ ను కీరోల్ గా నిలబెట్టారు కేసీఆర్. దీన్ని బట్టి మరోసారి ట్రబుల్ షూటర్ హరీష్ పవర్ ఏంటో టీఆర్ఎస్ లో తేటతెల్లమైంది.

First Published:  22 Oct 2018 3:00 AM GMT
Next Story