Telugu Global
NEWS

చంద్ర‌బాబు, జ‌గ‌న్‌ల స్టోరీ చెప్పిన కేసీఆర్ ! 

2014 ఏపీ ఎన్నిక‌ల స్టోరీని తెలంగాణ అభ్యర్థుల స‌మావేశంలో కేసీఆర్ వినిపించారు. 2014 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్‌, చంద్ర‌బాబు మ‌ధ్య  ఓట్ల శాత‌ం చాలా త‌క్కువ. జ‌గ‌న్‌కి ప‌రిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. కానీ అతి విశ్వాసంతో ముందుకువెళ్లారు. కానీ చంద్ర‌బాబు ప్ర‌ణాళికా బ‌ద్ధంగా వెళ్ల‌డంతోనే విజ‌యం సాధ్య‌మైంది. అందుకే టీఆర్ఎస్ అభ్య‌ర్థులు అతి విశ్వాసాన్ని వీడండి. ఆత్మ‌విశ్వాసంతో ముందుకు వెళ్లాల‌ని సూచించారు కేసీఆర్‌. తెలంగాణ భవన్ లో టిఆర్ఎస్ అభ్యర్థులు, ఎంపిలు, ముఖ్య నేతల సమావేశంలో కేసిఆర్ ఈ […]

చంద్ర‌బాబు, జ‌గ‌న్‌ల స్టోరీ చెప్పిన కేసీఆర్ ! 
X

2014 ఏపీ ఎన్నిక‌ల స్టోరీని తెలంగాణ అభ్యర్థుల స‌మావేశంలో కేసీఆర్ వినిపించారు. 2014 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్‌, చంద్ర‌బాబు మ‌ధ్య ఓట్ల శాత‌ం చాలా త‌క్కువ. జ‌గ‌న్‌కి ప‌రిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. కానీ అతి విశ్వాసంతో ముందుకువెళ్లారు. కానీ చంద్ర‌బాబు ప్ర‌ణాళికా బ‌ద్ధంగా వెళ్ల‌డంతోనే విజ‌యం సాధ్య‌మైంది. అందుకే టీఆర్ఎస్ అభ్య‌ర్థులు అతి విశ్వాసాన్ని వీడండి. ఆత్మ‌విశ్వాసంతో ముందుకు వెళ్లాల‌ని సూచించారు కేసీఆర్‌. తెలంగాణ భవన్ లో టిఆర్ఎస్ అభ్యర్థులు, ఎంపిలు, ముఖ్య నేతల సమావేశంలో కేసిఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్ర‌భుత్వ ప‌థ‌కాల ల‌బ్ధిదారులే టార్గెట్‌గా ముందుకు పోవాల‌ని కేసీఆర్ డైరెక్ష‌న్ ఇచ్చారు. ఒక్కో నియోజ‌క‌వ‌ర్గంలో ఎంత మంది పథ‌క ల‌బ్ధిదారులు ఉన్నారో వివ‌రాలు అభ్య‌ర్థుల‌కు అంద‌జేశారు. ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో ఆస‌రా ఫించ‌న్ ల‌బ్ధిదారులు సుమారు 40 నుంచి 60 వేల వ‌ర‌కు ఉన్నారు. వారిని క‌లిసి ఓట్లు అడ‌గాల‌ని….పోలింగ్ డే రోజు వారు తొలి రెండు గంటల్లోనే ఓటింగ్ వేసే విధంగా ప‌క్కాగా వ్య‌వ‌హ‌రించాల‌ని కేసీఆర్ సూచించారు.

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసిఆర్ కిట్లు, ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులు, ఆరోగ్య శ్రీ లబ్ధిదారులు, అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు, హోంగార్డుల వద్దకు వెళ్లి వారిని బూత్ లకు తరలించి ఓటేయించాలని చెప్పారు.

2014లో టీడీపీ ఈ ప్లాన్ ప‌క్కాగా వర్కవుట్ చేసింద‌ని ఆయ‌న వివ‌రించార‌ని సమాచారం. త‌మ‌కు ఓటు వేసేవారిని గుర్తించి… వారిని పోలింగ్ కేంద్రాల‌కు తీసుకురావ‌డంంలో టీడీపీ విజ‌య‌వంతం అయింద‌ని… అందుకే స్వ‌ల్ప తేడాతో విజ‌యం సాధించింద‌ని గుర్తు చేశారు. ఇక్క‌డ ప‌రిస్థితులు అలాగే ఉన్నాయ‌ని.. అతి విశ్వాసానికి పొవ‌ద్ద‌ని అభ్య‌ర్థుల‌ను హెచ్చ‌రించారు.

కేసిఆర్ ఇచ్చిన లెక్కల ప్రకారం బోధన్ నియోజకవర్గంలో ల‌బ్ధిదారుల సంఖ్య ఇలా ఉంది.

ఆసరా పెన్షన్ – 42,655
కళ్యాణ లక్ష్మి – 252
షాదీ ముబారక్ -249
కేసిఆర్ కిట్స్ -308
ఆరోగ్య శ్రీ -6922
అంగన్వాడీలు- 300
ఆశా వర్క‌ర్లు- 290

మొత్తం 58,273 మంది లబ్ధిదారులు బోధన్ నియోజకవర్గంలో ఉన్నారు.

First Published:  21 Oct 2018 11:00 PM GMT
Next Story