Telugu Global
Cinema & Entertainment

మంచు మనోజ్ ఇక సినిమాలు చేయడా..?

వరుసగా ఎన్ని సినిమాలు చేసినా క్లిక్ అవ్వకపోవడంతో ఈమధ్య విదేశీ పర్యటనలు చేశాడు మంచు మనోజ్. దేశాలు చుట్టొచ్చాడు. ఎంతోమంది మనుషుల్ని కలిశాడు. ఫైనల్ గా తన గమ్యం ఏంటో తెలుసుకున్నాడు. అవును.. మంచు మనోజ్ ప్రస్తుతానికి సినిమాలకు టాటా చెప్పేసినట్టే. తిరుపతి నుంచి తన కొత్త జీవిత ప్రయాణాన్ని ప్రారంభిస్తానని ప్రకటించాడు మంచు మనోజ్. రైతులు, పిల్లలు విద్యను పొందడంలో సహాయం చేస్తానని ప్రకటించాడు. “నేను కోరుకునే మనశ్శాంతి నాకు తిరుపతిలో దొరికిందని కచ్చితంగా చెప్పగలను. […]

మంచు మనోజ్ ఇక సినిమాలు చేయడా..?
X

వరుసగా ఎన్ని సినిమాలు చేసినా క్లిక్ అవ్వకపోవడంతో ఈమధ్య విదేశీ పర్యటనలు చేశాడు మంచు మనోజ్. దేశాలు చుట్టొచ్చాడు. ఎంతోమంది మనుషుల్ని కలిశాడు. ఫైనల్ గా తన గమ్యం ఏంటో తెలుసుకున్నాడు. అవును.. మంచు మనోజ్ ప్రస్తుతానికి సినిమాలకు టాటా చెప్పేసినట్టే.

తిరుపతి నుంచి తన కొత్త జీవిత ప్రయాణాన్ని ప్రారంభిస్తానని ప్రకటించాడు మంచు మనోజ్. రైతులు, పిల్లలు విద్యను పొందడంలో సహాయం చేస్తానని ప్రకటించాడు.

“నేను కోరుకునే మనశ్శాంతి నాకు తిరుపతిలో దొరికిందని కచ్చితంగా చెప్పగలను. నేను పెరిగిన ప్రదేశం, నా ఎదుగుదలకు కారణమైన ప్రదేశం ఇది. అణువణువు దైవత్వంతో నిండిన ఈ తిరుపతి గాలి పీల్చినప్పుడు ఏదో తెలియని పవర్ నన్ను ఆవహిస్తుంది.”

ఇలా తిరుపతి గురించి గొప్పగా చెప్పి ఇక అక్కడే కొన్నాళ్ల పాటు ఉంటానని చెప్పుకొచ్చాడు మంచు మనోజ్. తండ్రి మోహన్ బాబుకు చెందిన విద్యాసంస్థల వ్యవహారాల్ని చూసుకుంటానని ఇలా పరోక్షంగా చెప్పుకొచ్చాడు. అటు సినిమాలు, రాజకీయాల గురించి కూడా అప్పుడే ఓ అభిప్రాయానికి రావొద్దని సూచించాడు.

“నా ప్రయాణం రాయలసీమకే పరిమితం కాదు. ఏపీ, తెలంగాణలో కూడా ఈ అర్థవంతమైన ప్రయాణాన్ని కొనసాగిస్తాను. నా సినీ, రాజకీయ జీవితంపై ఎవరూ తీర్మానాలు చేయొద్దు. సినిమాలపై నా ఆసక్తి ఎప్పటికీ తగ్గదు.”

ఇలా క్లారిటీ ఇస్తూనే, ప్రస్తుతానికైతే సినిమాలపై ఆసక్తి లేదనే విషయాన్ని చెప్పేశాడు మంచు మనోజ్. రాయలసీమ వస్తున్నా… రాగి సంగటి, మటన్ పులుసు రెడీగా పెట్టండంటూ తను చెప్పదలుచుకున్నది పూర్తిచేశాడు.

ఓవరాల్ గా మంచు మనోజ్ బహిరంగ లేఖ చూస్తే ఒకటి మాత్రం స్పష్టం అవుతోంది. ప్రస్తుతానికి అతడు సినిమాలు చేయడు. శ్రీవిద్యా నికేతన్ కు సంబంధించి రాయలసీమ నుంచి కొత్తగా ఏదో ప్రారంభించబోతున్నాడు. ఇకపై తిరుపతిలోనే ఉండబోతున్నాడు.

First Published:  22 Oct 2018 5:59 AM GMT
Next Story