Telugu Global
NEWS

150 స్కోర్ల మొనగాడు రోహిత్ శర్మ

రోహిత్ దెబ్బతో మాస్టర్ సచిన్ రికార్డు తెరమరుగు టీమిండియా డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ… వన్డే క్రికెట్లో తన దూకుడును కొనసాగిస్తున్నాడు. పరుగుల హోరు, సెంచరీల జోరుతో రికార్డుల మోత మోగిస్తున్నాడు. గౌహతీ వేదికగా… వెస్టిండీస్ తో ముగిసిన తొలివన్డేలో 152 పరుగుల స్కోరుతో నాటౌట్ గా నిలవడం ద్వారా…మాస్టర్ సచిన్ టెండుల్కర్ పేరుతో ఉన్న ఐదు 150 స్కోర్ల రికార్డును తెరమరుగు చేశాడు. రోహిత్ శర్మ సాధించిన మొత్తం 20 సెంచరీలలో ఆరు 150కి పైగా స్కోర్లు […]

150 స్కోర్ల మొనగాడు రోహిత్ శర్మ
X
  • రోహిత్ దెబ్బతో మాస్టర్ సచిన్ రికార్డు తెరమరుగు

టీమిండియా డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ… వన్డే క్రికెట్లో తన దూకుడును కొనసాగిస్తున్నాడు. పరుగుల హోరు, సెంచరీల జోరుతో రికార్డుల మోత మోగిస్తున్నాడు.

గౌహతీ వేదికగా… వెస్టిండీస్ తో ముగిసిన తొలివన్డేలో 152 పరుగుల స్కోరుతో నాటౌట్ గా నిలవడం ద్వారా…మాస్టర్ సచిన్ టెండుల్కర్ పేరుతో ఉన్న ఐదు 150 స్కోర్ల రికార్డును తెరమరుగు చేశాడు.

రోహిత్ శర్మ సాధించిన మొత్తం 20 సెంచరీలలో ఆరు 150కి పైగా స్కోర్లు ఉండటం విశేషం.

2013లో బెంగళూరు వేదికగా ఆస్ట్రేలియా పై 209, కోల్ కతా వేదికగా 2014లో శ్రీలంకపై 264 పరుగులు, 2015లో కాన్పూర్ వేదికగా సౌతాఫ్రికా పై 150 స్కోరు, 2016లో పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా పై 171 నాటౌట్ స్కోరు, 2017లో మొహాలీ వేదికగా శ్రీలంకపై 208, వెస్టిండీస్ తో గౌహతీ వేదికగా ముగిసిన తొలివన్డేలో 152 పరుగుల నాటౌట్ స్కోరు రికార్డులను కేవలం రోహిత్ శర్మ మాత్రమే సాధించాడు.

వన్డే క్రికెట్లో మూడు డబుల్ సెంచరీలు సాధించిన భారత ఏకైక క్రికెటర్ కూడా రోహిత్ శర్మే కావడం మరో రికార్డు.

First Published:  22 Oct 2018 4:45 AM GMT
Next Story