Telugu Global
Cinema & Entertainment

రేపట్నుంచి సాహో హంగామా

రేపు ప్రభాస్ పుట్టినరోజు. కాబట్టి రేపట్నుంచి సాహో సినిమాకు ప్రచారం చేస్తే బాగుంటుందని మేకర్స్ భావించారు. అందుకే రేపు ఓ స్పెషల్ వీడియోను విడుదల చేయబోతున్నారు. రేపు ఉదయం సరిగ్గా 11 గంటలకు సాహో యూనిట్ నుంచి ఓ స్పెషల్ వీడియో రాబోతోంది. ప్రభాస్ బర్త్ డే కాబట్టి ఏదో వీడియో విడుదల చేసి సరిపెట్టడం లేదు. రేపట్నుంచి దశలవారీగా ఇలా వీడియోస్ విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి షేడ్స్ ఆఫ్ సాహో అనే టైటిల్ […]

రేపట్నుంచి సాహో హంగామా
X

రేపు ప్రభాస్ పుట్టినరోజు. కాబట్టి రేపట్నుంచి సాహో సినిమాకు ప్రచారం చేస్తే బాగుంటుందని మేకర్స్ భావించారు. అందుకే రేపు ఓ స్పెషల్ వీడియోను విడుదల చేయబోతున్నారు. రేపు ఉదయం సరిగ్గా 11 గంటలకు సాహో యూనిట్ నుంచి ఓ స్పెషల్ వీడియో రాబోతోంది.

ప్రభాస్ బర్త్ డే కాబట్టి ఏదో వీడియో విడుదల చేసి సరిపెట్టడం లేదు. రేపట్నుంచి దశలవారీగా ఇలా వీడియోస్ విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి షేడ్స్ ఆఫ్ సాహో అనే టైటిల్ ఫిక్స్ చేశారు. రేపు చాప్టర్-1 రాబోతోంది. ఇకపై దశలవారీగా చాప్టర్-2, చాప్టర్-3 అంటూ విడుదల చేస్తారన్నమాట.

Announcing #ShadesOfSaaho, a unique series unveiling fascinating titbits of this stellar project. Out tomorrow at 11AM. Stay Tuned ! #SaahoPrabhas Shraddha Kapoor Sujeeth UV Creations T-Series Films

Publiée par Saaho sur Lundi 22 octobre 2018

సాహో విడుదలకు చాలా టైం ఉంది. వచ్చే ఏడాది సమ్మర్ ఎట్రాక్షన్ గా సినిమాను విడుదల చేయాలని భావించినప్పటికీ.. సైరా సినిమా ఉండడంతో, సాహోను వాయిదావేశారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఆగస్ట్ 15ను సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలనుకుంటున్నారు. అప్పటివరకు ఇలా చాప్టర్లు విడుదలవుతూనే ఉంటాయన్నమాట.

First Published:  22 Oct 2018 7:08 AM GMT
Next Story