Telugu Global
Cinema & Entertainment

మరోసారి త్రిష ని టార్గెట్ చేసారు

ఇటివలే “96” సినిమాతో హిట్ అందుకున్న త్రిష మళ్ళి తిరిగి హిట్ ఫార్మ్ లోకి వచ్చింది. ఇప్పుడు త్రిష సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన “పెట్టా” సినిమాలో నటిస్తుంది. అయితే త్రిష ఈ సినిమా షూటింగ్ లో బిజీగా ఉండగానే త్రిష ట్విట్టర్ అకౌంట్ ని హ్యాక్ చేసారు. హ్యాకర్స్ తన ట్విట్టర్ ఎకౌంటు హ్యాక్ చేసినట్లు తెలుసుకున్న ఆమె పాస్ వర్డ్ మార్చుకుంది ఈ విషయాన్నీ త్రిష ట్విట్ చేసింది. తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా […]

మరోసారి త్రిష ని టార్గెట్ చేసారు
X

ఇటివలే “96” సినిమాతో హిట్ అందుకున్న త్రిష మళ్ళి తిరిగి హిట్ ఫార్మ్ లోకి వచ్చింది. ఇప్పుడు త్రిష సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన “పెట్టా” సినిమాలో నటిస్తుంది. అయితే త్రిష ఈ సినిమా షూటింగ్ లో బిజీగా ఉండగానే త్రిష ట్విట్టర్ అకౌంట్ ని హ్యాక్ చేసారు. హ్యాకర్స్ తన ట్విట్టర్ ఎకౌంటు హ్యాక్ చేసినట్లు తెలుసుకున్న ఆమె పాస్ వర్డ్ మార్చుకుంది ఈ విషయాన్నీ త్రిష ట్విట్ చేసింది.

తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా గుర్తు తెలియని వ్యక్తులు తప్పుడు సమాచారం పోస్ట్ చేస్తున్నారని, తన పేరుతో పోస్ట్ అయిన మెసేజ్ లను పట్టించుకోవద్దు అని, ఫ్యాన్స్ ఎవరూ రిప్లై ఇవ్వొద్దని ఆమె కోరింది. గతంలో కూడా త్రిష అకౌంట్ ఇలాగే హ్యాక్ అయిన సంగతి తెలిసిందే. మరి అప్పుడు ఇప్పుడు హ్యాక్ చేసింది వాళ్ళేనా అసలు ఎందుకు త్రిషనే టార్గెట్ చేస్తున్నారు అని విషయాలు తెలియాల్సి ఉంది. మొన్నటి వరకు “పెట్టా” షూటింగ్ కోసం వారణాసి వెళ్ళిన ఈ భామ షూటింగ్ పూర్తవ్వడం తో తిరిగి చెన్నై కి వచ్చేసింది.

First Published:  22 Oct 2018 12:45 AM GMT
Next Story