వెంకటేష్ ని పక్కన పెట్టిన త్రివిక్రమ్?

“అరవింద సమేత” బ్లాక్ బస్టర్ హిట్ తో త్రివిక్రమ్ శ్రీనివాస్ మళ్ళి ఫార్మ్ లోకి వచ్చేసాడు. ఈ హిట్ తో ఇప్పుడు స్టార్ హీరోస్ అందరి కన్ను త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద పడింది. అయితే వెంక‌టేష్  త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా వ‌స్తుంద‌ని హారిక హాసిని సంస్థ ప్ర‌క‌టించింది. దాంతో ఈ సినిమా మొదలవబోతుంది అనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో వచ్చింది.

“అర‌వింద స‌మేత‌” కి ముందే ఈ కాంబోలో సినిమా ఉంటుంద‌ని ఆశించారు. కానీ కుద‌ర్లేదు. “అర‌వింద స‌మేత‌” త‌ర‌వాతైనా ఉంటుంద‌ని అనుకున్నారు. కానీ ఇప్పుడు బ‌న్నీకి క‌మిట్ అయిపోయాడు త్రివిక్ర‌మ్‌. దాంతో ఇప్పుడు అసలు వెంకీ త్రివిక్రమ్ కాంబినేషన్ ఉంటుందా లేదా అనేది అనుమానంగా మారింది. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే వెంకీ త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా ఇప్పుడప్పుడే ఉండదు అని క్లియర్ గా అర్ధం అవుతుంది. ఎందుకంటే త్రివిక్రమ్ దగ్గర వెంకటేష్ కి సరిపోయే కథ కంటే కూడా బన్నీ కి సరిపోయే కథ ఉంది. బన్నీ కూడా అటు విక్రం కే కుమార్ సినిమాని కొన్ని రోజులు పక్కన పెట్టి త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేద్దాం అనే ప్లానింగ్ లో ఉన్నాడు.