Telugu Global
Cinema & Entertainment

డ్రగ్స్ వలలో మరో సినీ నటుడు

ఆమధ్య టాలీవుడ్ ను డ్రగ్స్ రాకెట్ ఎంతలా కుదిపేసిందో అందరికీ తెలిసిందే. టాలీవుడ్ కు చెందిన ఎంతోమంది ప్రముఖులు పోలీసు విచారణ ఎదుర్కోవలసి వచ్చింది. దీనిపై పోలీసులు, సిట్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కేసు అలా పెండింగ్ లో పెట్టారు. కానీ అప్పట్లో అది సంచలనం అయింది. ఇప్పుడు మరో నటుడి కారణంగా మరోసారి డ్రగ్స్ రాకెట్ తెరపైకి వచ్చింది. బాలీవుడ్ నటుడు అజాజ్ ఖాన్, ఈసారి డ్రగ్స్ రాకెట్ లో బుక్ అయ్యాయి. నిషేదిత ఉత్ప్రేరకాలు […]

డ్రగ్స్ వలలో మరో సినీ నటుడు
X

ఆమధ్య టాలీవుడ్ ను డ్రగ్స్ రాకెట్ ఎంతలా కుదిపేసిందో అందరికీ తెలిసిందే. టాలీవుడ్ కు చెందిన ఎంతోమంది ప్రముఖులు పోలీసు విచారణ ఎదుర్కోవలసి వచ్చింది. దీనిపై పోలీసులు, సిట్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కేసు అలా పెండింగ్ లో పెట్టారు. కానీ అప్పట్లో అది సంచలనం అయింది. ఇప్పుడు మరో నటుడి కారణంగా మరోసారి డ్రగ్స్ రాకెట్ తెరపైకి వచ్చింది.

బాలీవుడ్ నటుడు అజాజ్ ఖాన్, ఈసారి డ్రగ్స్ రాకెట్ లో బుక్ అయ్యాయి. నిషేదిత ఉత్ప్రేరకాలు తీసుకుంటున్నాడనే ఆరోపణలపై యాంటీ-డ్రగ్స్ పోలీసులు అజాజ్ ఖాన్ ను అరెస్ట్ చేశారు. దీంతో మరోసారి ఇండస్ట్రీ మొత్తం అలెర్ట్ అయింది. సోమవారం రాత్రే రెడ్ హ్యాండెడ్ గా ఖాన్ ను అరెస్ట్ చేసినట్టు నవీ-ముంబయి పోలీసులు వెల్లడించారు. అన్ని విషయాలు రూఢి చేసుకున్న తర్వాత ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు.

అరెస్ట్ కావడం అజాజ్ కు కొత్తకాదు. గతంలో ఓ బ్యూటీషియన్ కు అభ్యంతరకర ఫొటోలు, మెసేజీలు పంపినందుకు పోలీసులు ఇతడ్ని అరెస్ట్ చేశారు. ఆ కేసు ఇంకా నడుస్తూనే ఉంది. ఇంతలోనే డ్రగ్స్ కేసులో మళ్లీ బుక్ అయ్యాడు. గతేడాది వచ్చిన రోగ్ అనే తెలుగు సినిమాలో ఇతడు విలన్ గా కనిపించాడు. పలు హిందీ, తమిళ సినిమాల్లో కూడా నటించాడు.

First Published:  23 Oct 2018 7:12 AM GMT
Next Story