Telugu Global
National

పేటీఎం అధినేతను బ్లాక్‌మెయిల్‌ చేసిన సోనియా ధావన్‌

పేటీఎం అధినేత విజయ్ శేఖర్ శర్మ వెనుక ఆయన వ్యక్తిగత కార్యదర్శి గోతులు తవ్వింది. 20 కోట్లు ఇవ్వకుంటే రహస్యాలన్నీ బయటపెడుతానని బ్లాక్‌మెయిల్‌కు దిగింది. చివరకు ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. సోనియా ధావన్‌ పేటీఎం స్థాపించినప్పటి నుంచి కంపెనీలో పనిచేస్తోంది. విజయ్ శేఖర్ శర్మకు వ్యక్తిగత కార్యదర్శిగా ఉంటోంది. ఆ చనువుతోనే అతడికి సంబంధించి లాప్‌టాప్‌, మొబైల్, కంప్యూటర్లను వాడుకుంటూ వచ్చింది. ఆ సమయంలోనే శర్మకు సంబంధించిన వ్యక్తిగత డేటాను, కంపెనీ రహస్యాలను సేకరించింది. వాటిని […]

పేటీఎం అధినేతను బ్లాక్‌మెయిల్‌ చేసిన సోనియా ధావన్‌
X

పేటీఎం అధినేత విజయ్ శేఖర్ శర్మ వెనుక ఆయన వ్యక్తిగత కార్యదర్శి గోతులు తవ్వింది. 20 కోట్లు ఇవ్వకుంటే రహస్యాలన్నీ బయటపెడుతానని బ్లాక్‌మెయిల్‌కు దిగింది. చివరకు ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు.

సోనియా ధావన్‌ పేటీఎం స్థాపించినప్పటి నుంచి కంపెనీలో పనిచేస్తోంది. విజయ్ శేఖర్ శర్మకు వ్యక్తిగత కార్యదర్శిగా ఉంటోంది. ఆ చనువుతోనే అతడికి సంబంధించి లాప్‌టాప్‌, మొబైల్, కంప్యూటర్లను వాడుకుంటూ వచ్చింది. ఆ సమయంలోనే శర్మకు సంబంధించిన వ్యక్తిగత డేటాను, కంపెనీ రహస్యాలను సేకరించింది.

వాటిని రోహిత్ కోమల్ అనే వ్యక్తికి చేరవేసింది. అతడి ద్వారా శేఖర్ శర్మ సోదరుడు అజయ్ శేఖర్‌కు ఫోన్ చేయించి డబ్బు డిమాండ్ చేయించింది. 20 కోట్లు ఇవ్వకపోతే రహస్యాలు బయటపెడుతానని పేటీఎంపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని నాశనం చేస్తానని హెచ్చరించాడు.

కానీ కంపెనీ పెద్దలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సోనియా గుట్టు బయటకు వచ్చింది. సోనియా ధావన్‌ను అరెస్ట్‌ చేసి ఆమెపై కేసు నమోదు చేశారు. నోయిడాలోని కంపెనీ కార్యాలయంలోనే ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని పేటీఎం కూడా ధృవీకరించింది.

First Published:  23 Oct 2018 4:30 AM GMT
Next Story