Telugu Global
National

కాంగ్రెస్‌కు కొత్త భయం.... రూటు మారుస్తోంది!

రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించేస్తే వచ్చే ఓట్లు రావని అనుకుంటున్నారో లేక మిత్రపక్షాలన్నీ దూరం అవుతాయని భయపడుతోందో కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రూటు మారుస్తోంది. కాంగ్రెస్ నయా వ్యూహం ఏమిటంటే రాహుల్ ప్రధానమంత్రి అభ్యర్థి కాదు అనేది. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేత చిదంబరం సెలవిచ్చాడు. తాము రాహుల్ ను ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించలేదు అని ఈయన అంటున్నాడు. అంతే కాదు ఎన్నికల్లోపు ఈ నిర్ణయాన్ని తీసుకునేది లేదని కూడా చిదంబరం స్పష్టం చేశాడు. […]

కాంగ్రెస్‌కు కొత్త భయం.... రూటు మారుస్తోంది!
X

రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించేస్తే వచ్చే ఓట్లు రావని అనుకుంటున్నారో లేక మిత్రపక్షాలన్నీ దూరం అవుతాయని భయపడుతోందో కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రూటు మారుస్తోంది. కాంగ్రెస్ నయా వ్యూహం ఏమిటంటే రాహుల్ ప్రధానమంత్రి అభ్యర్థి కాదు అనేది. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేత చిదంబరం సెలవిచ్చాడు.
తాము రాహుల్ ను ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించలేదు అని ఈయన అంటున్నాడు. అంతే కాదు ఎన్నికల్లోపు ఈ నిర్ణయాన్ని తీసుకునేది లేదని కూడా చిదంబరం స్పష్టం చేశాడు.

రాహుల్ గాంధీని తాము ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రచారం చేయమని, ఈ నినాదంతో ఎన్నికలకు వెళ్లమని ఈయన తేల్చేశాడు. దీనికి గట్టి కారణాలే ఉన్నాయి.

ఇప్పుడిప్పుడే కాంగ్రెస్‌తో మిత్రపక్షాలు కలిసి వస్తున్నాయి. పలు చోట్ల పలు పార్టీలతో పొత్తులు ఏర్పడుతున్నాయి. అయితే వీళ్లు రాహుల్ ను ప్రధానిగా అంటే ఒప్పుకుంటారనే నమ్మకం లేదు.

రాహుల్ నాయకత్వంలో పని చేయడానికి వీళ్లు సిద్ధంగా లేరు. అందుకు తాజా నిదర్శనం మాయావతి తీసుకున్న నిర్ణయం. మధ్యప్రదేశ్, రాజస్తాన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టేది లేదని మాయ స్పష్టం చేసింది. తాము సొంతంగా అయినా పోటీ చేస్తాం కానీ.. కాంగ్రెస్ తో పొత్తుకు నో అని బీఎస్పీ స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ కు దెబ్బ పడ్డట్టే. బీఎస్పీ భారీగా ఓట్లను పొందితే అప్పుడు కాంగ్రెస్ కు దెబ్బ పడుతుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ రూటు మారుస్తోంది. తాము మిత్రపక్షాల మాటకు విలువనిస్తామని, ఆ పార్టీల అభిప్రాయాల ప్రకారమే ప్రధాని అభ్యర్థిని కూడా ఎంపిక చేస్తామని కాంగ్రెస్ దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది. అంతిమంగా రాహుల్ ప్రధాని అభ్యర్థి కాదని తేల్చేసింది.

First Published:  22 Oct 2018 7:02 PM GMT
Next Story