Telugu Global
Cinema & Entertainment

ఆ సీన్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను " శ్రియ

సీనియర్ హీరోయిన్ అయిన శ్రియ గత రెండు దశాబ్దాలగా సౌత్ సినిమాని ఒక ఊపు ఊపేస్తుంది. ఇప్పుడు ఈ భామ తెలుగు లో ఒక కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రీవిష్ణులు ప్రధానపాత్రల్లో నటిస్తున్న సినిమా “వీర భోగ వసంత రాయులు”. ఈ సినిమాకి సంబందించిన ప్రమోషన్స్ లో పాల్గొన్న శ్రీయ ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నట్టు చెప్పింది. సిగరెట్ తాగడం, మందు కొట్టే సన్నివేశాల్లో నటించడం […]

ఆ సీన్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను  శ్రియ
X

సీనియర్ హీరోయిన్ అయిన శ్రియ గత రెండు దశాబ్దాలగా సౌత్ సినిమాని ఒక ఊపు ఊపేస్తుంది. ఇప్పుడు ఈ భామ తెలుగు లో ఒక కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రీవిష్ణులు ప్రధానపాత్రల్లో నటిస్తున్న సినిమా “వీర భోగ వసంత రాయులు”. ఈ సినిమాకి సంబందించిన ప్రమోషన్స్ లో పాల్గొన్న శ్రీయ ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నట్టు చెప్పింది.

సిగరెట్ తాగడం, మందు కొట్టే సన్నివేశాల్లో నటించడం చాలా ఇబ్బందిగా అనిపించినట్లు కూడా చెప్పింది ఈ భామ. ఒక గదిలో సిగరెట్ కొట్టే సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నప్పుడు ఆ రూమ్ మొత్తం సిగరెట్ పొగతో నిండిపోయిందని చెప్పింది. ఆ సిగరెట్ పొగకి గదిలో ఉన్నవారంతా ఇబ్బంది పడ్డారు అని చెప్పింది. ఇలాంటి సీన్స్ చేయడం చాలా కష్టంగా అనిపించినప్పటికీ సినిమా ఫలితం చూసి అవన్నీ మరిచిపోతానని చెప్పింది. ఈ సినిమాతో మళ్ళి తను తెలుగు ప్రేక్షకుల అభిమానం సాధించడం ఖాయం అని శ్రియ చెప్తుంది.

First Published:  22 Oct 2018 10:59 PM GMT
Next Story