Telugu Global
Cinema & Entertainment

క్లైమాక్స్ షూటింగ్ పూర్తీ చేసుకున్న "సై రా"

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమా “సై రా నరసింహారెడ్డి”. స్వాతంత్ర సమరయోధుడు అయిన ఉయ్యాలా వాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. రామ్ చరణ్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాని సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే గత నెల క్లైమాక్స్ షూట్ కోసం జార్జియా వెళ్ళిన “సై రా” ఆ క్లైమాక్స్ షూట్ ని ఎట్టకేలకు పూర్తీ చేసుకుంది. దాదాపు 300 ల మంది ఫైటర్స్ తో అక్కడ […]

క్లైమాక్స్ షూటింగ్ పూర్తీ చేసుకున్న సై రా
X

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమా “సై రా నరసింహారెడ్డి”. స్వాతంత్ర సమరయోధుడు అయిన ఉయ్యాలా వాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. రామ్ చరణ్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాని సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే గత నెల క్లైమాక్స్ షూట్ కోసం జార్జియా వెళ్ళిన “సై రా” ఆ క్లైమాక్స్ షూట్ ని ఎట్టకేలకు పూర్తీ చేసుకుంది.

దాదాపు 300 ల మంది ఫైటర్స్ తో అక్కడ క్లైమాక్స్ ని షూట్ చేసాడు సురేందర్ రెడ్డి. సినిమా మొత్తానికి క్లైమాక్స్ హై లైట్ గా నిలుస్తుంది అని మూవీ యూనిట్ భావిస్తున్నారు. కెమెరా మెన్ రత్నవేలు అయితే ఈ షెడ్యూల్ కోసం బాగా కష్టపడినట్టు తెలుస్తుంది.

నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ చిరంజీవికి గురువుగా నటిస్తున్నాడు. జగపతి బాబు, బ్రహ్మాజీ, సుదీప్, విజయ్ సేతుపతి వంటి నటీనటులు ఈ సినిమాలో ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.

First Published:  23 Oct 2018 4:05 AM GMT
Next Story