Telugu Global
NEWS

50రోజులు అక్కడే ఉంటా చంద్రబాబూ....

తిత్లీ తుపాను ప్రభావిత ప్రాంత ప్రజలను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ మండిపడ్డారు. కుటుంబానికి 200 రూపాయల సరుకులు ఇవ్వడం మినహా మరే సాయం చంద్రబాబు చేయలేదని మండిపడ్డారు. తుపాను ప్రాంతంలో ఇప్పటికీ తాగేందుకు నీరు కూడా లేని పరిస్థితి ఉందన్నారు. నీటిని అడిగిన బాధితులను బుల్డోజర్‌తో తొక్కిస్తా అని హెచ్చరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు జగన్‌. మరికొద్ది రోజుల్లోనే తాను పాదయాత్రగా తుపాను ప్రాంతంలోకి వెళ్తానని…. అక్కడే 50 […]

50రోజులు అక్కడే ఉంటా చంద్రబాబూ....
X

తిత్లీ తుపాను ప్రభావిత ప్రాంత ప్రజలను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ మండిపడ్డారు. కుటుంబానికి 200 రూపాయల సరుకులు ఇవ్వడం మినహా మరే సాయం చంద్రబాబు చేయలేదని మండిపడ్డారు.

తుపాను ప్రాంతంలో ఇప్పటికీ తాగేందుకు నీరు కూడా లేని పరిస్థితి ఉందన్నారు. నీటిని అడిగిన బాధితులను బుల్డోజర్‌తో తొక్కిస్తా అని హెచ్చరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు జగన్‌. మరికొద్ది రోజుల్లోనే తాను పాదయాత్రగా తుపాను ప్రాంతంలోకి వెళ్తానని…. అక్కడే 50 రోజుల పాటు ఉంటానని చెప్పారు. ప్రతి గ్రామాన్ని సందర్శిస్తానన్నారు.

విజయనగరం సాలూరు సభలో ప్రసంగించిన జగన్‌… తుపాను ప్రాంతంలో ప్రభుత్వం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదన్నారు. తుపాను బాధితులు చంద్రబాబును అడ్డుకుంటే దాన్ని కూడా చంద్రబాబు పబ్లిసిటీ కోసం వాడుకోవడం సిగ్గు చేటన్నారు. ప్రభుత్వ యంత్రాంగం, ఖజానా అంతా మీ దగ్గర పెట్టుకుని ప్రతిపక్ష నేత తుపాను ప్రాంతంలో పర్యటించలేదని మాట్లాడడం సరైనదేనా అని నిలదీశారు.

హుద్‌హుద్‌ తుపాను సమయంలో 65వేల కోట్ల రూపాయల నష్టం జరిగిందన్నారు. కానీ ఇటీవల అక్కడ ప్రభుత్వం ఖర్చు చేసింది 926 కోట్లు అని చంద్రబాబే చెప్పారన్నారు. అందులోనూ కేంద్రం ఇచ్చింది 500 కోట్లు అన్నారు. అంటే హుద్‌హుద్‌ బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది కేవలం 400 కోట్లేనా అని జగన్‌ నిలదీశారు.

ఇంతచేసి హుద్‌హుద్‌ను జయించామని చంద్రబాబు ప్రచారం చేసుకుంటూ, సంబరాలు చేసుకుంటున్నారని జగన్‌ ఎద్దేవా చేశారు. ప్రజలను గాలికొదిలేసి… పైగా ప్రకృతిని హ్యాండిల్ చేస్తున్నా, సముద్రాన్ని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నా, రెయిన్‌గన్‌లతో కరువుపై యుద్దం చేసి అనంతపురం జిల్లా నుంచి తరిమేశా అని చంద్రబాబు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

First Published:  22 Oct 2018 8:50 PM GMT
Next Story